Chiranjeevi : చిరంజీవి బర్త్ డే రోజు విడుదలైన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకూ 150కి పైగా సినిమాలు చేశారు. ఇందులో కొన్ని గెస్ట్ రోల్ చేసినవీ ఉన్నాయి. ఎనభైల చివరలోనే మెగాస్టార్ గా మారిన చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాల స్పెషాలిటీస్ చాలానే చూశాం.. చదివాం. అయితే ఇన్నేళ్ల కెరీర్ లో ఆయన బర్త్ డే రోజు విడుదలైన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
స్టార్ హీరోల బర్త్ డే అంటేనే ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. ఒక కొత్త సినిమా విడుదలైనంత హడావిడీ చేస్తుంటారు. అలాంటిది మెగాస్టార్ బర్త్ డేకు ఓ కొత్త సినిమానే రిలీజ్ అయిందంటే ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ లో ఉంటాయి. అది కూడా ఆయన కెరీర్ లో ఫస్ట్ టైమ్ బర్త్ డేకు రిలీజ్ అవుతోన్న మూవీ అంటే ఇంక చెప్పేదేముందీ.. అలాంటి అంచనాల మధ్యే విడుదలైన సినిమా ‘చంటబ్బాయ్’. ఈ టైటిల్ వినగానే ఆ సినిమా అప్పట్లో ఎందుకు యావరేజ్ అనిపించుకుందో అర్థమైంది కదా. యస్.. మెగాస్టార్ బర్త్ డే రోజు వస్తోన్న సినిమా అంటే మాస్, యాక్షన్, మంచి ఫైట్లు, డ్యాన్సులు ఎక్స్ పెక్ట్ చేస్తారు ఆడియన్స్. బట్ అవేం లేకుండా పూర్తిగా కామెడీ మూవీతో వచ్చాడు చిరంజీవి. జంధ్యాల డైరెక్ట్ చేసిన ఈ మూవీ చార్లీ చాప్లిన్ సినిమాలనుంచి ఇన్స్ స్పైర్ అయినట్టు కనిపిస్తుంది. జంధ్యాల ఇమేజ్ కు వంద శాతం సరిపోయింది కానీ.. చిరంజీవి ఇమేజ్ కు చాలా దూరంగా కనిపించింది. అందుకే అప్పట్లో ఆ మూవీకి జస్ట్ యావరేజ్ టాక్ వచ్చింది. అది కూడా బర్త్ డే రోజు విడుదలైంది కాబట్టి అలా వదిలేశారేమో తెలియదు కానీ.. చంటబ్బాయ్ తర్వాత మరే సినిమా కూడా చిరంజీవి బర్త్ డే రోజు విడుదల కాలేదు. ఒకవేళ ఈ మూవీ రిజల్ట్ అందుకు సెంటిమెంట్ గా అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. మెగాస్టార్ పుట్టిన రోజే విడుదలైన మొదటి చివరి సినిమా చంటబ్బాయ్.చంటబ్బాయ్ లో చిరంజీవి ఒక ప్రైవేట్ సీక్రెట్ ఏజెంట్. బట్ సినిమా అంతా కామెడీగా ఉంటుంది. అయినా ఓ సీరియస్ కేస్ ను సాల్వ్ చేస్తారు. సుత్తివేలు, సుహాసిని, జగ్గయ్య, సుధాకర్, ముచ్చర్ల అరుణలు కీలక పాత్రల్లో కనిపిస్తారు. అన్నట్టు ఈ మూవీలో అల్లు అరవింద్ కూడా ఓ కేమియో రోల్ లో కనిపిస్తాడు. సో.. అదీ మేటర్.