Lucky Baskhar Trailer : లెక్కలు మార్చిన లక్కీ భాస్కర్ ట్రైలర్

Update: 2024-10-22 10:04 GMT

సినిమాలకు సంబంధించి ఏది ఎప్పుడు హైలెట్ అవుతుందో.. ఏది ఎప్పుడు హైప్ పెంచుతుందో చెప్పలేం. నిన్నటి వరకూ దుల్కర్ సాల్మన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమాకు సంబంధించి ఎలాంటి హైపూ, అంచనాలు లేవు. బట్ ట్రైలర్ తర్వాత ఒక్కసారిగా లెక్కలు మారాయి. ఇలాంటి ట్రైలర్ ఈ మధ్య చూడలేదు అనేట్టుగా ఉంది. స్ట్రాంగ్ కంటెంట్ కనిపిస్తోంది. మిడిల్ క్లాస్ స్ట్రగుల్స్ నుంచి.. రిచ్ మేన్ గా మారేందుకు తన వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోయిన ఓ సగటు మనిషి కథను చూడబోతున్నాం అనేలా ఉంది. ట్రైలర్ లోనే కథంతా కనిపించింది. బట్.. కథనం ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది అనేలా ఉంది. బలమైన పాత్రలు కనిపిస్తున్నాయి. రియలిస్టిక్ ఎమోషన్స్ ఉన్నాయి. యాక్షన్ కంటే దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టున్నారు.

దుల్కర్ సాల్మన్ సినిమా అంటే ముందు బలమైన కథ గ్యారెంటీ. ఒక్కోసారి కథనం గాడి తప్పితే తప్ప అతని స్టోరీ సెలెక్షన్ ఎప్పుడూ రాంగ్ కాదు. అది ఏ భాష అయినా సరే అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. లక్కీ భాస్కర్ లోనూ అదే కనిపిస్తోంది. వెంకీ అట్లూరి రూపొందించిన సినిమా ఇది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో మరో కంప్లీట్ ఫ్యామిలీ మూవీ చూడబోతున్నాం అనిపించేలా ఉంది. మీనాక్షి చౌదరి, సిరివెన్నెల ఫేమ్ సర్వదమన్ బెనర్జీ, సాయి కుమార్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్ కన్నా.. డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ అని నమ్మినా.. చివరికి అయిన వారి నుంచి కూడా ఛీత్కారం ఎదుర్కొన్నా.. డబ్బు విలువను గట్టిగా చెప్పే ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది. మొత్తంగా లక్కీ భాస్కర్ ట్రైలర్ తో ఓ స్ట్రాంగ్ కంటెంట్ చూడబోతున్నాం అనే ఫీల్ అందరిలోనూ వచ్చింది. ఈ నెల 31న గట్టి పోటీ ఉంది. ఆ పోటీని తట్టుకుని నిలబడే సత్తా తమలో ఉందని అంచనాలూ పెంచిందీ ట్రైలర్. మరి లక్కీ భాస్కర్ కు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. 

Tags:    

Similar News