మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తర్వాతి సినిమాల విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది.. అనే టాక్ వినిపించింది. బట్ అలాంటిదేం లేదు అనేది క్లియర్ గా తేలిపోయింది. ప్రస్తుతం అతను ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తున్నాడు. ఇదో భారీ మూవీ. రెండు భాగాలుగా ఉండబోతోంది.. అనే టాక్ కూడా ఉంది. 2026 జూన్ 25న విడుదల చేయబోతున్నారు మూవీ. అంతకు ముందే షూటింగ్ పూర్తి చేస్తాడు. ఆపై అతను త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూవీ చేయబోతున్నాడు. ఇదో పౌరాణిక చిత్రం ఇది. ఈ మేరకు కథ అంతా సెట్ అయింది. అయితే ఈ మూవీ విషయంలో కొంత గందరగోళం ఉంది. త్రివిక్రమ్ తో మూవీ ఉండకపోవచ్చు అనే మాటలు వినిపించాయి. బట్ అందులో నిజం లేదు.
నిజానికి త్రివిక్రమ్ కూడా చాలా వేగంగా వెంకటేష్ తో మూవీ చేస్తున్నాడు. ఈ సమ్మర్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం అని ప్రకటించారు కూడా. ఆ తర్వాత ఎన్టీఆర్ తో మూవీకి సిద్ధం అవుతాడు. ఈలోగా ఎన్టీఆర్ దేవర 2కు వెళ్లబోతున్నాడు. ఆ మూవీ పూర్తి కావడానికి మరో యేడాది టైమ్ పడుతుంది అనే మాటలు వినిపించాయి. అంటే త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో మూవీ 2027 సగంలో స్టార్ట్ అవుతుంది అంటున్నారు. బట్ అందులో ఏ మాత్రం నిజం లేదు. దేవర2 విషయంలో ఎన్టీఆర్ మాగ్జిమం లైట్ తీసుకున్నాడు అనేది తేలిపోయింది. దేవర 2 కోసం అతను ఎదురు చూసే పరిస్థితిలో లేడు అంటున్నారు. అందుకే త్రివిక్రమ్ మూవీకి రెడీ అవుతాడు. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ తో కూడా మూవీ ఉండబోతోంది. ఒకవేళ దేవర 2 ఉండాల్సి ఉంటే అప్పుడు త్రివిక్రమ్ తో సైమల్టేనియస్ తో కూడా రెడీ అవుతాడు. అది విషయం. మొత్తంగా దేవర 2 కంటే కూడా అతను త్రివిక్రమ్ తో మూవీకి రెడీ అవుతాడు. అందులో ఏ డౌట్ లేదు అనేది క్లియర్.