నవంబర్ 21న చాలా సినిమాలు తెలుగు మూవీస్ విడుదలవుతున్నాయి. డబ్బింగ్ సినిమాలు కూడా వస్తున్నాయి. చూడ్డానికి వీళ్లు ప్రధానంగా నాలుగు సినిమాలు అని చెబుతున్నారు కానీ డజను మూవీస్ వరకు 21న విడుదల కాబోతున్నాయి. అయితే ఈ మొత్తంలో కొదమ సింహంపై అంచనాలున్నాయి. రీ రిలీజ్ అవుతోంది కాబట్టి చాలా మంది ఎదురుచూస్తున్న మూవీ కూడా ఇదే. బట్ రెగ్యులర్ మూవీ పై రాజు వెడ్స్ రాంబాయి పైనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది అని భావించే వారు ఎక్కువమంది ఉన్నారు.
రాజు వెడ్స్ రాంబాయి మూవీ చాలామందికి కనెక్ట్ అవుతుంది అని భావించే వారు ఉన్నారు. ఈ చిత్రంపై అంచనాలున్నాయి. ఇప్పటి వరకు మూవీ గురించి ఎక్స్ పెక్ట్ చేస్తున్న వాళ్లంతా చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఇలాంటి సినిమా గ్యారెంటీగా బావుంటుంది అనుకుంటున్నారు. హీరో చనిపోతాడు అని తెలిసే ఉండేలా కూడా సినిమా గురించి బాగా చెప్పుకుంటున్నారు. ఇంటర్ కాస్ట్ నేపథ్యంలో ఇప్పటివరకు చాలామూవీస్ వచ్చి ఉన్నా.. ఈ చిత్రం కొత్తగా ఉంటుంది అంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు గురించి ఎంటర్ అవుతున్నాడు అంటేనే మూవీ గురించి అంచనాలు ఉన్నాయి.
మరి ఈ మూవీపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి అనేది అందరికీ తెలుసు కాబట్టి వాటిని అందుకోవడంలో మాత్రం విజయవంతం అవుతుందా లేదా అనేది చూడాలి.
మిగతా మూవీస్ విషయంలో మాత్రం అంతగా అంచనాలు కనిపించడం లేదు. ఉన్నంత వరకు అవి రెగ్యులర్ మూవీస్ అనేది మాత్రమే అర్థం అవుతోంది. హారర్ నేపథ్యంలో 12ఏ రైల్వే కాలనీ కొంత కొత్తగా ఉంటుందేమో అనిపించలేదు. బట్ ప్రేమంటే, పాంచ్ మినార్ మాత్రం రొటీన్ గానే ఉండేలా ఉన్నాయి. ఒకవేళ ఆ చిత్రాలు కూడా ఆకట్టుకుంటే మాత్రం ఈ వారం అదిరిపోతుంది అని చెప్పాలి.