కాంతార 1 తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు హీరో రిషబ్ శెట్టి. కాంతార మూవీతో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు అతను.. కాంతార 1 తో కూడా హిట్ అందుకున్నాడు. మామూలుగా ఓ సినిమాకు సీక్వెల్ ఉంటుంది. కానీ కాంతారకు మాత్రం ప్రీ క్వెల్ గా చేశారన్నమాట. అలాంటి మూవీతో నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటీ..? ఎలాంటి మూవీ చేస్తాడు అనే డౌట్స్ కు చెక్ పెట్టాడు రిషబ్ శెట్టి.
రిషబ్ శెట్టి తర్వాతి మూవీని ప్రశాంత్ వర్మతోనే చేయబోతున్నాడు. ప్రశాంత్ వర్మతో జై హనుమాన్ చేయాల్సి ఉంది. కానీ మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే టాక్ వినిపించింది. ప్రశాంత్ వర్మ చెప్పిన కథ విషయంలోనే తప్పులు కనిపించాయి అనే టాక్ కూడా వచ్చింది. బట్ అందులో నిజం లేదు అనే విషయం తేలిపోయింది. కాంతార 1 తర్వాత రిషబ్ శెట్టి తర్వాతి మూవీని జై హను మాన్ తో చేయబోతున్నాడు. ఈ మేరకు ప్రశాంత్ హడావిడీగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశాడు. వేగంగా వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ పైనే సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు.
ప్రస్తతానికి అయితే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ మాత్రం స్టార్ట్ చేశాడు. జనవరి నుంచి జై హను మాన్ సెట్స్ పైకి వెళ్లబోతోంది అనే టాక్ వినిపించింది. ఈ మూవీ తర్వాత రిషబ్ శెట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే మూవీ చేయబోతున్నాడు. ఆ తర్వాత కూడా కాంతార : చాప్టర్ 2 అనే మూవీ కూడా పట్టాలెక్కించబోతున్నాడని టాక్. మొత్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీ స్టార్ట్ కావడానికి ముందు అతనికి వచ్చిన టైమ్ నే జై హను మాన్ తో స్టార్ట్ చేయబోతున్నాడు అన్నమాట.