Ravi Teja : భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటిటి డేట్ ఇదే

Update: 2026-02-12 08:51 GMT

మాస్ మహారాజ్ రవితేజ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ మూవీతో అతను తన ట్రెండ్ మార్చాడు. కథ పాతదే అయినా అతని కోసం ప్రెజెంట్ చేసిన విధానం బావుంది. తన ఇమేజ్ కు భిన్నమైన ప్రయత్నంగా ఈ మూవీ కనిపిస్తుంది. ఆ కారణంగా రొటీన్ మూవీ అయినా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. జనవరి 13న విడుదలైన ఈ చిత్రానికి పూర్తిగా పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకే సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో రవితేజ నుంచి వచ్చిన జెన్యూన్ అటెంప్ట్ గా కనిపిస్తోందీ మూవీ. అషికా రంగనాథ్, డింపుల్ హయాతీ హీరోయిన్లుగా నటించారు. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేశాడీ మూవీని.

భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటిటిలో విడుదల అయ్యే డేట్ గా ఫిబ్రవరి 13న వినిపించింది. బట్ ఆ డేట్ మార్చారు. ఈ నెల 20 నుంచి ఈ మూవీ ఓటిటిలో స్ట్రీమ్ కాబోతోంది. ఓటిటి ప్లాట్ ఫామ్ జీ5లో ఈ మూవీ విడుదల కాబోతోంది. మరి ఈ చిత్రానికి ఓటిటిలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో కానీ కంటెంట్ పరంగా మాత్రం ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనిపించేలా ఉంది. ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగే హీరోల కథలు ఎప్పుడూ పాజిటివ్ గానే ఉంటాయి. మరి ఈ మూవీకీ అలాంటి రిజల్టే వస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News