Telugu Culture : తెలుగుదనానికి ముగ్గురు లెజెండ్స్

Update: 2024-08-29 17:30 GMT

విశ్వదేవ్, నివేదా థామస్లు హీరో, హీరోయిన్గా నందకిషోర్ ఈమని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా '35- చిన్న కథకాదు' రానా సమర్పణలో ఈ సినిమా వస్తోంది. సెప్టెంబర్ 6న ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ పాట యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీలోని వివేక్ సాగర్ స్వరపరిచిన నీలి మేఘముల పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. పాట ఆరంభంలో టాలీవుడ్ లెజెండ్స్ ప్రముఖ రచయిత సిరివెన్నెల, ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్, ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు నివాళ్లు అంటూ సిరివెన్నెల కలం + విశ్వనాథుని చిత్రం +బాలు గళం = తెలుగుదనం అంటూ స్లైడ్ వేయడం జరిగింది. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగుదనం నిండిన ఈ పాటను విడుదల చేశారు. నీలి మేఘముల అంటూ మనోహరంగా సాగుతున్న ఈ పాట ప్రస్తుతం మెల్లమెల్లగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సాహిత్యంలోనే కాకుండా లిరికల్ వీడయోలో కూడా తెలుగుదనం ఉట్టిపడినట్లుగా కనిపిస్తుంది. సినిమా మొత్తం కూడా చాలా అహ్లాదకరంగా ఉంటుందని ఈ పాట లిరికల్ వీడియో చూస్తూ ఉంటే అనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తంమవుతోంది.

Tags:    

Similar News