Tiger 3 Box Office Collection Day 2: రెండో రోజు రూ.100కోట్లు దాటిన కలెక్షన్స్
2వ రోజు ఈ చిత్రం సరికొత్త మైలురాయిని సాధించిన టైగర్ 3.. టోటల్ కలెక్షన్ రూ.102 కోట్లకు చేరినట్టు నివేదికలు వెల్లడి;
YRF స్పై యూనివర్స్ ఐదవ భాగం, 'టైగర్ 3' నవంబర్ 12న వెండితెరపైకి వచ్చింది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్ చూసింది. ఒక్క రోజులోనే దీని కలెక్షన్స్ రూ.44 కోట్లు దాటింది. 'టైగర్ 3' షారుఖ్ ఖాన్ పఠాన్ రికార్డ్‌ను బద్దలు కొట్టే అవకాశం ఉన్నందున అభిమానులందరూ బాక్సాఫీస్ రిపోర్ట్‌పై దృష్టి పెట్టారు. ఇక 2వ రోజు ఈ చిత్రం సరికొత్త మైలురాయిని సాధించింది.
Sacnilk తొలి అంచనాల ప్రకారం, 'టైగర్ 3' బాక్సాఫీస్ వద్ద రూ.57.50 కోట్లు వసూలు చేసింది. తొలిరోజు రూ.44.5 కోట్లు రాబట్టగా, అందులో హిందీ వెర్షన్ తెలుగు, తమిళ వెర్షన్లలో వరుసగా రూ.43 కోట్లు, రూ.1.3 కోట్లు, రూ.0.2 కోట్లు వసూలు చేసింది. టైగర్ 3 టోటల్ కలెక్షన్ రూ.102 కోట్లు.
ఈ చిత్రం మొత్తం 48.62 శాతం ఆక్యుపెన్సీని చూసింది. సాయంత్రం షోల సమయంలో అత్యధిక ఆక్యుపెన్సీ రేటు 62.53 శాతంగా నమోదైంది.
'టైగర్ 3' ఆక్యుపెన్సీ రేట్ 2వ రోజు, హిందీలో..
మార్నింగ్ షోలు: 21.69 శాతం
మధ్యాహ్నం షోలు: 52.49 శాతం
సాయంత్రం షోలు: 62.53 శాతం
నైట్ షోలు: 57.76 శాతం
'టైగర్ 3' గురించి
స్పై-థ్రిల్లర్ 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' చిత్రాలకు సీక్వెల్. టైగర్, జోయా సంవత్సరాల తర్వాత తిరిగి రావడాన్ని ఇది సూచిస్తుంది. రొమాంటిక్ పాత్రలకు పర్యాయపదంగా ఉండే ఇమ్రాన్ హష్మీ ఈసారి విలన్‌గా నటించాడు. సల్మాన్ ఖాన్ ఫ్యాక్టర్‌తో పాటు, 'పఠాన్'గా షారుఖ్ ఖాన్, 'కబీర్' అతిధి పాత్రలో హృతిక్ రోషన్ కారణంగా కూడా ఈ చిత్రం అభిమానులకు ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా 'టైగర్ 3' వెండితెరపైకి వచ్చినప్పటి నుండి థియేటర్ల నుండి అనేక గందరగోళ సంఘటనలు నివేదించబడ్డాయి. సూపర్‌స్టార్ ఎంట్రీపై అభిమానులు క్రాకర్స్ పేల్చుతున్న ఓ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై సల్మాన్ ఖాన్ ఓ ప్రకటన విడుదల చేస్తూ తన అభిమానులు భద్రతను ఉల్లంఘించవద్దని కోరారు.