Tiger Nageswara Rao Teaser : ఎనిమిదేళ్ళకే రక్తం తాగడం మొదలు పెట్టిన మాస్ హీరో
'టైగర్ నాగేశ్వర రావు' టీజర్ రిలీజ్. మాస్ లుక్ లో రవితేజ;
మాస్ మాహారాజా రవితేజ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వర రావు'ను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రవితేజ ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసినా కూడా.. ఈ సినిమాలో మరింత భిన్నంగా కనిపించనున్నారని ఈ టీజర్ ను చూస్తేనే తెలుస్తోంది. స్టువర్టుపురం నాగేశ్వరరావు పాత్రలో ఆయన గెటప్ ను డైరెక్టర్ చాలా కొత్తగా చూపించారు. రవితేజ లుక్స్ మరింత పవర్ ఫుల్ గా ఉన్నాయి.
''నాగేశ్వరరావు రాజకీయాల్లోకి వెళ్లి ఉంటే... వాడి తెలివితేటలతో ఎలక్షన్స్ గెలిచేవాడు. స్పోర్ట్స్ లోకి వెళ్లి ఉంటే... వాడి పరువుతో ఇండియాకు మెడల్ గెలిచేవాడు. ఆర్మీలోకి వెళ్లి ఉంటే... వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు. దురదృష్టవశాత్తూ వాడు ఒక క్రిమినల్ అయ్యాడు సార్'' అని మురళీ శర్మ చెప్పే డైలాగ్ కానీ, ఎనిమిదేళ్ళకు రక్తం తాగడం మొదలు పెట్టాడనే డైలాగ్ హీరోయిజం చూపించింది. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన బాలీవుడ్ హీరోయిన్ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు.
Full View
నుపుర్ సనన్ ఇప్పటికే తెలుగులో మహేష్ బాబు 'వన్ నేనొక్కడినే', అక్కినేని నాగ చైతన్య 'దోచేయ్', ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రాల్లో నటించింది. అక్షయ్ కుమార్, నుపుర్ సనన్ కలిసి ఓ మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది. అయితే హీరోయిన్ గా తెలుగులో ఆమెకు తొలి చిత్రమిది. ఇదిలా ఉండగా 1970లలో దక్షిణ భారతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, స్టువర్టుపురం నాగేశ్వరరావు కథతో ఈ సినిమా రూపొందుతోంది
The Invasion begins now &
— Ravi Teja (@RaviTeja_offl) August 17, 2023
The hunt begins on October 20th :)
Here’s the Teaser of #TigerNageswaraRao 🥷🏾🐅https://t.co/1MTwH9q5tv@DirVamsee @AbhishekOfficl @AAArtsOfficial @AnupamPKher #RenuDesai @gvprakash @MayankOfficl @NupurSanon @gaya3bh @madhie1 pic.twitter.com/MJNA5ZFe8a