LGM: పబ్ లో నదియా రచ్చరచ్చ.. "టిక్కీ టిక్కీ టాటా"
'ఎల్జీఎం' నుంచి టిక్కీ టిక్కీ టాటా" వీడియో సాంగ్ విడుదల;
"LGM - లెట్స్ గెట్ మ్యారేడ్" చిత్రం నుంచి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని "టిక్కీ టిక్కీ టాటా" అనే వీడియో సాంగ్ ను మేకర్స్ ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో, ప్రతిభావంతులైన రమేష్ తమిళమణి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాక్షి సింగ్ ధోని, వికాస్ హసిజా నిర్మించారు.
సినిమాని సంగీతం, ఆకట్టుకునే విజువల్స్ కు ఇప్పటికే ప్రేక్షకుల నుండి భారీ స్పందన రాగా.. లేటెస్ట్ రిలీజ్ అయిన ఈ సాంగ్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. పబ్ లో నదియా చేసే డ్యాన్స్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ఈ పాటను స్వరకర్త, రమేష్ తమిళ్మణి పాడగి.. మరల మరపురాని సంగీత అనుభవాన్ని అందించి, తన ప్రజ్ఞను మరోసారి ప్రదర్శించారు."టిక్కి టిక్కీ టాటా"కు నిత్యశ్రీ వెంకట్రమణన్ తన గాత్రాన్ని అందించగా... ఈ శ్రావ్యమైన స్వరానికి శరత్ సంతోష్ రాసిన సాహిత్యం ఎంతో ఆకట్టుకుంటోంది.
"LGM - లెట్స్ గెట్ మ్యారేజ్" స్టార్-స్టడెడ్ తారాగణం విషయానికొస్తే హరీష్ కళ్యాణ్, నదియా, ఇవానా, యోగి బాబు, RJ విజయ్ వంటి ఇతర నటీనటులు నటిస్తున్నారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశ్వజిత్ ఒడుక్కతిల్ సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటింగ్‌తో ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందేలా చూస్తున్నారు.
Full View
ఇక క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ... ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తన పేరిట బ్యానర్ పెట్టి ఈ సినిమాను నిర్మించాడు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ 'ఎల్‌జీఎం' సినిమా మాత్రం అభిమానుల అంచనాల స్థాయిని అందుకోలేకపోయింది. దాదాపు అందరి నుండి ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి . దీంతో ధోనీ అభిమానులు నిరాశకు గురయ్యారు. కాబట్టి ఎల్‌జీఎం సినిమా భవిష్యత్ బాక్సాఫీస్ వద్ద కష్టమే. ధోనీ తొలి సినిమా ప్రయత్నమే ఎదురుదెబ్బ తగిలింది. ఎల్‌జీఎమ్ మూవీని తెలుగులో అదే పేరుతో డబ్ చేస్తున్నారు. తెలుగులో మాత్రం వారం ఆలస్యంగా ఆగస్ట్ 4న ఎల్‌జీఎమ్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.