Tollywood : రిలీజ్ కు రెడీ గా 'ఓ సాథియా'

Update: 2023-03-09 12:48 GMT

ఏ సినిమా తీసుకున్నా అందులో ప్రేమ కథ ఉంటుంది. అలాంటి ప్రేమ కథనే ఇతి వృత్తంగా తీసుకుని చేసే సినిమాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ప్రేమ కథ చిత్రాలకు యూత్‌ ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుంటుంది. అందుకే మేకర్లు లవ్ స్టోరీలను తెరకెక్కించేందుకు మక్కువ చూపుతుంటారు. ఈ కోవలోకే ఇప్పుడు ఓ సాథియా అనే సినిమా కూడా రాబోతోంది. ఈ సినిమాకు దర్శకనిర్మాతలిద్దరూ మహిళలే కావడం విశేషం. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా 'ఓ సాథియా' అనే చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో ఆర్యాన్ గౌర హీరోగా నటిస్తున్నారు.  జీ జాంబి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఆర్యాన్. ఓ వైపు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆర్యాన్ గౌర మొదటి సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు రెండో సినిమా ఓ సాథియా అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఆర్యాన్ గౌరకు జోడిగా మిస్తీ చక్రవర్తి జతకట్టారు.  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఇప్పటికే ఓ సాథియా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ సోషల్ మీడియాలో ఎంతగానో ఆదరణను దక్కించుకుంది.

ఓ సాథియా నుంచి విడుదల చేసిన టైటిల్ సాంగ్, వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన వెళ్లిపోయే పాటలకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్లతో సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది.  ఈజే వేణు సినిమాటోగ్రఫీ విన్ను సంగీతాన్ని సమకూర్చారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను  ప్రకటించనున్నారు .

సాంకేతిక బృందం

దర్శకత్వం : దివ్య భావన

నిర్మాత : చందన కట్టా

లైన్ ప్రొడ్యూసర్: వంశీ కృష్ణ జూలూరు

ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్స్: చంద్ర తివారీ ఆవుల, కేశవ్ సాయి కృష్ణ గౌడ్

బ్యానర్ : తన్విక జశ్విక క్రియేషన్స్

సంగీత దర్శకుడు : విన్ను

పాటల రచయితలు : భాస్కర భట్ల, అనంత శ్రీరామ్, రాంబాబు గోసాల

కొరియోగ్రఫర్స్ : రఘు మాస్టర్, బాబా భాస్కర్, ఆనీ మాస్టర్

ఎడిటర్ : కార్తిక్ కట్స్

కెమెరామెన్ : ఈజే వేణు

పీఆర్వో : సాయి సతీష్

Similar News