Karthik Rathnam : త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న మునికన్న
Karthik Rathnam : నటుడు కార్తీక్ రత్నం త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శనివారం చాలా గ్రాండ్ గా అతని నిచ్చితార్ధం జరిగింది.;
Karthik Rathnam : నటుడు కార్తీక్ రత్నం త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శనివారం చాలా గ్రాండ్ గా అతని నిచ్చితార్ధం జరిగింది. ఈ వేడుకకి ఇరు కుటుంబ సభ్యులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే కార్తీక్ రత్నంకి కాబోయే భార్య గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక వెంకటేష్ మహా డైరెక్షన్ లో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయ్యాడు కార్తీక్.. ఆ తరవాత వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలో మునికన్నగా నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.. స్క్రీన్ పైన కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ అదరగొట్టేశాడు. తాజాగా అర్ధశతాబ్దం అనే సినిమాలో నటించాడు.