Pooja Hegde : బుట్టబొమ్మకి దిల్ రాజు బంపర్ ఆఫర్..!
Pooja Hegde : టాలీవుడ్ ఇండస్ట్రీకి 'లక్కీ చార్మ్'గా మారిపోయింది హీరోయిన్ పూజా హెగ్డే.. ఆ అమ్మడు పట్టిందల్ల బంగారం అయిపోతుంది.;
Pooja Hegde : టాలీవుడ్ ఇండస్ట్రీకి 'లక్కీ చార్మ్'గా మారిపోయింది హీరోయిన్ పూజా హెగ్డే.. ఆ అమ్మడు పట్టిందల్ల బంగారం అయిపోతుంది. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
వెంకటేష్, వరుణ్ తేజ్ మెయిన్ లీడ్‌లో తెరకెక్కుతోన్న మూవీ ఎఫ్3.. ఎఫ్2కి సీక్వెల్‌గా వస్తోన్న ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. డబ్బు ఎక్కువ అవ్వడం వలన కలిగే ఇబ్బందులు ఏంటి అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. తమన్నా, మేహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అయితే ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు పూజా హెగ్డేని అప్రోచ్ అయ్యారట దిల్ రాజు.. దీనికి పూజా హెగ్డే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఆ సాంగ్ చిత్రీకరణ ఉంటుందని సమాచారం. ఈ ఐటెం సాంగ్ కోసం బుట్టబొమ్మకి కోటి రూపయాల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట దిల్ రాజు. ఒక్కో సినిమాకి పూజా రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది.. ఒక్క ఐటెం సాంగ్ కి కోటి రూపాయల రెమ్యునరేషన్ అంటే మాములు విషయం కాదని చెప్పాలి.
కాగా పూజా గతంలో రంగస్థలంలో రామ్ చరణ్‌తో కలిసి జిగేల్ రాణి అంటూ ఆడి పాడి ఆదరగోట్టింది. ఇక పూజా నటించిన లేటెస్ట్ మూవీ బీస్ట్ ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.