Naveen Chandra wife : వాట్.. నవీన్ చంద్రకి పెళ్లైందా.. ?
Naveen Chandra wife : అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు నవీన్ చంద్ర.. ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేశాడు..;
Naveen Chandra wife : అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు నవీన్ చంద్ర.. ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేశాడు కానీ.. అవి ఆశించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.. మంచి నటుడుగా మాత్రం నవీన్ చంద్రకి పేరుంది. ఎక్కువగా సినిమా విషయాలు తప్ప పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకోడు నవీన్.. కానీ తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అందరికి ఊహించని షాక్ ఇచ్చాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా తన భార్యతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు.
'ప్రేమ ఎప్పుడూ గుండెల్లో ఉంటుంది. హ్యాపీ వాలెంటైన్స్ డే వైఫీ. నా బెటర్ హాఫ్ ఓర్మా' అంటూ పోస్ట్ పెట్టాడు నవీన్ చంద్ర.. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు అవాక్కు అవుతున్నారు.. ఇంతకీ నవీన్ చంద్రకి ఎప్పుడు పెళ్లైంది అంటూ షాక్ అవుతున్నారు. ఏదైతేనెం శుభాకాంక్షలు, చూడచక్కని జంట అంటూ నవీన్‌కు ఫ్యాన్స్ విషెస్ తెలియజేస్తున్నారు. కాగా ప్రస్తుతం నవీన్ చంద్ర గని, విరాట పర్వం చిత్రాలలో కీ రోల్ పోషిస్తున్నాడు.