NTR on Politics: రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్

NTR on Politics: టాలీవుడ్ టాప్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Update: 2022-04-01 11:45 GMT

NTR on Politics: టాలీవుడ్ టాప్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.. అయితే క్రియాశీల రాజకీయాల పైన ఎన్టీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు ఎన్టీఆర్ .. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. తాను 17 ఏళ్ల వయస్సులో పరిశ్రమలోకి వచ్చానని ప్రస్తుతం నటుడిగా కెరీర్‌ ప్రారంభించి సుమారు 20 యేళ్లు అవుతోందని అన్నారు.. హిట్, ప్లాప్ వచ్చినా ఆ క్షణానికే తీసుకుంటానని అన్నారు. అయితే ప్రతి ఫెయిల్యూర్‌ ప్రతి మనిషికి ఏదో ఒకటి నేర్పుతుందని వ్యక్తిగతంగా తాను నమ్ముతానని పేర్కొన్నారు.

ఒకసారి జరిగిన తప్పును గ్రహించి మళ్లీ ఆ తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు. సెట్‌‌లో ఉన్నంత వరకే స్టార్ అని అనుకుంటానని బయటకు వస్తే మామూలు మనిషేలాగే ఫీల్ అవుతానని అన్నారు. ఇక తన తాతయ్య ఎన్టీఆర్‌ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అన్నారు.. తనలో ఆయన ఎంతో స్ఫూర్తి నింపారని, సొసైటీ మనకు ఎంతో ఇస్తుంది. మనం కూడా ఎంతో కొంత వెనక్కి ఇవ్వాలి అనే విషయాన్ని ఆయన నుంచే నేర్చుకున్నానని తెలిపారు.

ఇక క్రియాశీల రాజకీయాల గురించి మాట్లాడుతూ.. తాను భవిష్యత్తు గురించి నమ్మనని.. కేవలం ఈ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకునే వ్యక్తినని అన్నారు.. ఓ నటుడిగా ప్రస్తుతం ఈ ప్రయాణాన్ని అన్నివిధాలుగా ఎంజాయ్‌ చేస్తున్నానని, మంచి సినిమాలు చేసుకుంటూ ఎంతో సంతృప్తిగా ఉన్నానని అన్నారు. 2024 ఎన్నికల నాటికి ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ అవుతారని భావించిన ఎన్టీఆర్ అభిమానులకి ఈ వ్యాఖ్యలు నిరాశ కలిగించాయని చెప్పాలి. కాగా 2009ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ టీడీపీ తరుపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News