Hero Rajasekhar : పండగ పూట సినీ నటుడు రాజశేఖర్ ఇంట విషాదం..!
Hero Rajasekhar : పండగ పూట సినీ నటుడు రాజశేఖర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి వరదరాజన్ గోపాల్(93) గురువారం సాయంత్రం కన్నుమూశారు.;
Hero Rajasekhar : పండగ పూట సినీ నటుడు రాజశేఖర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి వరదరాజన్ గోపాల్(93) గురువారం సాయంత్రం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరదరాజన్ గోపాల్ చెన్నై డీఎస్పీగా పనిచేసి రిటైర్ అయ్యారు. కాగా ఆయనని ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.. ఇందులో రాజశేఖర్ చిన్న కుమారుడు. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు వరదరాజన్ భౌతిక కాయాన్ని చెన్నైకి తరలించనున్నారు. అక్కడే ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా 2017లో రాజశేఖర్ తల్లి ఆండాళ్ వరదరాజ్ (82) మరణించారు.