Anchor Suma : సుమ కనకాల సినిమా పోస్టర్ రెడీ! న్యూ లుక్.. సీరియస్ కిక్
Anchor Suma : నేనా సినిమాల్లోకా అని ఆమధ్య తెగ సస్పెన్స్ మెయింటైన్ చేసిన సుమ..;
Anchor Suma (tv5news.in)
Anchor Suma : నేనా సినిమాల్లోకా అని ఆమధ్య తెగ సస్పెన్స్ మెయింటైన్ చేసిన సుమ.. మొత్తానికి వెండితెరపై మళ్లీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఇప్పటికే టీవీలో ఎంటర్ టైన్ మెంట్ ఫీల్డ్ లో హల్ చల్ చేస్తున్న ఈ వసపిట్ట.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైనా మరోసారి మెరుపులు మెరిపించడానికి రెడీ అయ్యింది. తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై దానికి సంబంధించిన డీటైల్స్ ను పోస్ట్ చేసింది.
సుమ నటిస్తున్న సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తోంది ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి. అంటే ఈ సినిమా మ్యూజికల్ ఫీస్ట్ ను అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతానికి ఈ సినిమా పేరును ప్రొడక్షన్ నెంబర్ 2 గా వ్యవహరిస్తున్నారు. నవంబర్ ఆరో తేదీన రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేస్తారు.
పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో సూర్యకాంతి కనిపిస్తూ ఉంటుంది. పోస్టర్ అంతా అరుణవర్ణంతో ఉంటుంది. చీరకట్టుతో ఉన్న సుమ కనకాల ఓ పుస్తకాన్ని పట్టుకుని ఆ సూర్యకాంతివైపు నడుస్తూ ఉంటుంది. చీరకట్టును బట్టి.. తనది ఈ సినిమాలో కీ రోల్ అని అర్థమవుతోంది. ఓ పోరాటనికి సిద్ధమైనప్పుడో, సీరియస్ గా ఓ పని చేయడానికి రెడీ అయినప్పుడో మహిళలు ఎలా ఉంటారో అలాగే ఉంది సుమ గెటప్.
యాంకర్ సుమ బుల్లితెరపై తిరుగులేని స్టార్. ఇందులో సందేహం లేదు. కానీ వెండితెరపై రాణించాలంటే దానికి పోటీతో పాటు ఫేమ్ కూడా కావాలి. ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ పై యాక్టింగ్ సుమకు కొత్త కాదు. అందుకే ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చినా సరే.. తగ్గేదే లేదు అంటూ మరోసారి డేరింగ్, డాషింగ్ తో దూసుకుపోవడానికి సిద్ధమైంది.
The Title & FL Motion Poster of@vennelacreation's #ProdNo2 🎬
— Suma Kanakala (@ItsSumaKanakala) November 5, 2021
Tomorrow @ 11.43 AM 😊
Launch by MEGA POWER STAR⚡ @AlwaysRamCharan @mmkeeravaani @VijayKalivarapu @Anushkumar04 #BalagaPrakash#suma #SumaKanakala #anchorsuma pic.twitter.com/E1STbDTAUX