Allu Arjun : 2024 టాలీవుడ్ అంతా వివాదాల మయం

Update: 2024-12-31 11:15 GMT

2024 జనవరి నుంచి డిసెంబర్ చివరి వరకూ టాలీవుడ్ ను వివాదాలు ఓ రేంజ్ లో చుట్టు ముట్టాయి. తెలుగు సినిమా చరిత్రలో ఒకే యేడాది ఇన్ని వివాదాలు ఎప్పుడూ రాలేదు అనే చెప్పాలి. పైగా ఒకరిద్దరు కాదు. అనేక మందికి సంబంధించిన ఇష్యూస్ కాంట్రవర్శీస్ క్రియేట్ అయ్యాయి. జనవరిలో సంక్రాంతి సందర్భంగా గుంటూరు కారం, హను మాన్ సినిమాల విడుదల తేదీలకు సంబంధించి నిర్మాతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. మీడియా దీన్ని రకరకాలుగా చిత్రించడంతో చివరికి ఛాంబర్ పెద్దలు ముందుకు వచ్చిన వ్యవహారం చక్కబెట్టాల్సి వచ్చింది.

హీరో రాజ్ తరుణ్ తన లవర్ లావణ్యతో సాగిన వ్యవహారం కూడా చాలా కాలం సాగింది. ఈ ఎపిసోడ్ సాగుతున్న టైమ్ లోనే అతనివి మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఈ కాంట్రవర్శీ ఆ సినిమాలకు కూడా ఏ మాత్రం ఉపయోగపడలేదు. సరికదా అన్నీ డిజాస్టర్స్ అయిపోయాయి. వీళ్ల గొడవ కూడా పోలీస్ స్టేషన్ నుంచి కోర్ట్ వరకూ వెళ్లింది.

సీనియర్ నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో చిక్కుకోవడం.. కాదు అని తను బుకాయించడం.. కర్ణాటక పోలీస్ లు సీరియస్ గా తీసుకుని ఆమెను అరెస్ట్ చేసి కోర్ట్ లో ప్రవేశపెట్టారు.

 

హేమ తర్వాత చాలా రోజులకు మరో సీనియర్ నటి కస్తూరి తెలుగు వారిపై చేసిన కామెంట్స్ కు చాలా చోట్ల కేస్ లయ్యాయి. ఈ కేస్ లో ఆమెను చెన్నై పోలీస్ లు అరెస్ట్ చేసి కోర్ట్ కు తరలించారు.

 

ఇక మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలైతే పీక్స్ లో కనిపించాయి. ఇది టాలీవుడ్ ప్రతిష్టకు సంబంధించిందే కాదు. కానీ ఓ సీనియర్ నటుడుగా ఆయన ఈ వయసులో కోర్ట్ మెట్ల వరకూ వెళ్లాల్సి రావడం విషాదం. మరోవైపు మంచు మంటలు ఇంకా ఆరనేలేదు. మరోసారి ఆ మోహన్ బాబు, విష్ణు మేనేజర్స్ అడవిలో పందులను వేటాడి దొరికిపోయారు. అది మరో కాంట్రవర్శీ కాబోతోంది.

 

ఇక కాంట్రవర్శీకా బాప్.. నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్టుగా సాగిన గొడవ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ సంఘటన. ఓ ప్రమాదాన్ని రాజకీయ పార్టీలు వాడుకున్నాయని కొందరు కామెంట్స్ చేసినా.. ప్రభుత్వం చట్ట ప్రకారమే నడుచుకుందని మెజారిటీ జనం అభిప్రాయపడ్డారు. ఈ కేస్ లో అల్లు అర్జున్ ఒక రాత్రి జైలులో గడపాల్సి వచ్చింది. ప్రస్తుతం బెయిల్ పైనే ఉన్నాడు. కేస్ లో అతను ఏ 11 కానీ ఏ 1 అన్న స్థాయిలో చూస్తున్నారని అతను కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం.. అసెంబ్లీ సాక్షిగా తన వ్యక్తిత్వాన్ని కించపరిచారని చెప్పడం.. దీన్ని పోలీస్ లు సవాల్ గా తీసుకుని ప్రతిగా మరో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంతో పాటు అల్లు అర్జున్ బెయిన్ క్యాన్సిల్ చేయాలని హై కోర్ట్ కు వెళ్లారు. ఈ కేస్ లో జనవని 3న తీర్పు రానుంది. తీర్పు పోలీస్ లకు అనుకూలంగా ఉంటే మరోసారి ఐకన్ స్టార్ జైలుకు వెళ్లక తప్పదు.

మొత్తంగా 2024 టాలీవుడ్ కు వివాదాల యేడాదిగా మిగిలిపోయింది. 2025 అయినా ఎలాంటి గొడవలూ లేకుండా అల్లు అర్జున్ కేస్ కూడా క్లియర్ అయిపోయి సామాన్యుల జేబులకు చిల్లులు పెట్టకుండానే సినిమాలన్నీ మంచి విజయం సాధించాలని.. కోరుకుందాం. 

Tags:    

Similar News