Trisha : మీకు నిద్రెలా పడుతుంది.. త్రిష షాకింగ్ రిప్లై

Update: 2025-04-11 13:30 GMT

సినిమావాళ్లు రూమర్స్ ను లైట్ తీసుకున్నంతగా ట్రోల్స్ ను తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అవి మరీ శృతి మించి కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు అసభ్యంగా, ఇంకొన్ని సార్లు అసహ్యంగా. అందుకే ఇలాంటి వాటికి వెంటనే రియాక్ట్ అవుతున్నారు. అయితే త్రిష ఈ రెండూ కాకపోయినా తనను పర్సనల్ గా టార్గెట్ చేసిన వారికి షాకింగ్ రిప్లై ఇచ్చింది.

త్రిష నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఈ గురువారం విడుదలైంది. ఈ చిత్రంలో తను అజిత్ కు భార్యగా, 18యేళ్ల కొడుక్కి తల్లిగా నటించింది. అయితే సినిమాలో ఆమె లుక్ బాలేదనీ, మరీ ముసలిదానిలా కనిపిస్తోందనీ, నటన అస్సలు బాలేదని కొందరు పర్సనల్ గా టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. దీనికి వెంటనే రియాక్ట్ అయింది త్రిష.

'టాక్సిక్ పీపుల్(విషపూరితమైన జనాల్లారా). మీ జీవితం ఎలా ఉంటుంది. నిజంగా మీరు బాగా నిద్రపోతారా..? సోషల్ మీడియాలో కూర్చుని ఇతరుల గురించి అర్థంలేని విషయాలను పోస్ట్ చేయడం నిజంగా మీ రోజు ఆనందంగా ఉంటుందా.? మీ గురించి, మీరు నివసించే లేదా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి నాకు నిజంగా భయంగా ఉంది" అంటూ ఓ పోస్ట్ పెట్టింది త్రిష.

నిజానికి ఈ సినిమాలో తన నటన బానే ఉంటుంది. లుక్ విషయంలో ఈ సారి కర్లీ హెయిర్ ట్రై చేసింది అంతే. మరి త్రిషనే ఓల్డ్ అనే వాళ్లు ఇంక అజిత్ ను ఏమనాలో..?

Tags:    

Similar News