Trisha : త్రిషకు సెకండ్ చాన్స్ కలిసొస్తుందా?

Update: 2024-07-19 05:57 GMT

జోడీ సినిమాతో 1999లో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ త్రిష కృష్ణన్. ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగింది. గ్యాప్ తర్వాత పొన్నియన్ సెల్వన్ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈ అమ్మడికి అవకాశాలు అనూహ్యంగా వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, విశ్వనటుడు కమల హాసన్ సరసన నటిస్తోంది. 18 ఏళ్ల తర్వాత చిరంజీవితో కలిసి నటించే అవకాశం 'విశ్వంభర' ద్వారా సాధ్యమైంది. అంతకు ముందు ఇదే జోడీ స్టాలిన్ మూవీలోనూ కనిపించింది. ఇక కమల్ హాసన్ తో మాత్రం తొలిసారి 'థగ్ లైఫ్' లో మణిశర్మ ఛాన్స్ ఇవ్వడంతో సాధ్యమైంది. తాజాగా 14 ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా విష్ణు వర్దన్ దర్శకత్వంలో 'ది బుల్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. 14 ఏండ్ల క్రితం 'కట్టామిట్టా' అనే చిత్రంతో అమ్మడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అక్షయ్ కుమార్ సరసన త్రిష నటించింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఆమెకు బాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. చాలా ప్రయత్నాలు చేసినా బాలీవుడ్ దర్శకులు త్రిష వైపు చూడలేదు. దీంతో లాభం లేదనుకొని సౌత్ ఇండస్ట్రీలోనే అడ్జెస్ట్ అయ్యింది. ఈ సినిమా దర్శకుడు విష్ణు వర్ధన్ కూడా తమిళ డైరెక్టరే. త్రిషకి ఆ రకంగానే బాలీవుడ్ లో అవకాశం వచ్చిందనే టాక్ కూడా ఉంది. హిందీ డైరెక్టర్ అయితే పరిస్థితి మరోలా ఉండేదనే వారూ ఉన్నారు. ఏది ఏమైనా 14 ఏండ్ల తర్వాత త్రిషకు బాలీవుడ్ లో అవకాశం వచ్చింది. ఇది కలిసొస్తుందా.. లేదా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News