Trivikram Srinivas : ఈ స్టేట్‌మెంట్‌తో ఎవరైనా బాధపడితే క్షమించండి : త్రివిక్రమ్

Trivikram Srinivas : ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ సుదీర్ఘంగా మాట్లాడారు. సినిమాలో నటించిన కొత్త నటీనటులందరూ చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ అద్భుతంగా నటించారని అన్నారు.

Update: 2022-02-26 11:21 GMT

Trivikram Srinivas : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ భీమ్లానాయక్.. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. వరల్డ్ వైడ్ గా నిన్న(ఫిబ్రవరి)25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక సినిమాకి హిట్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.


ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ సుదీర్ఘంగా మాట్లాడారు. సినిమాలో నటించిన కొత్త నటీనటులందరూ చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ అద్భుతంగా నటించారని అన్నారు. ఇక 1980 కాలం నాటి నటీనటులతో పోల్చితే ఇండియన్‌ న్యూ జనరేషన్‌ ఆర్టిస్ట్‌లుు ఎంతో టాలెంట్‌ ఉన్న వ్యక్తులని అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ స్టేట్‌మెంట్‌తో ఎవరైనా బాధపడితే క్షమించండి. కానీ ఇప్పటితరం వాళ్లకు సినిమాపై ప్రేమ, ప్రతివిషయంలో వాళ్లకున్న అవగాహన గొప్పది. ఐదేళ్లుగా నేనీ విషయాన్ని గమనిస్తున్నాని త్రివిక్రమ్ తెలిపారు.


ఇక దర్శకుడు సాగర్‌ ఈ కథని ఎంతగానో అర్థం చేసుకొని అద్భుతంగా తెరకెక్కించారని, మొగిలయ్యతో పాట పాడించాలన్న ఐడియా సాగర్ దే అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు త్రివిక్రమ్. కాగా ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మించగా, దీనికి థమన్ ఎస్ సంగీతం అందించారు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు.

Tags:    

Similar News