Trivikram : త్రివిక్రమ్ పర్యవేక్షణలోనే పవన్ కొత్త రీమేక్...!
Trivikram : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల మధ్య మంచి సానిహిత్యం ఉంది.;
Trivikram : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల మధ్య మంచి సానిహిత్యం ఉంది. జల్సా సినిమాతో మొదలైన వీరిద్దరి ప్రయాణం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. పవన్ చేసే సినిమాలలో త్రివిక్రమ్ హ్యాండ్ కంపల్సరీగా ఉంటుంది. త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ పవన్ అడగగానే తీన్ మార్, భీమ్లానాయక్ సినిమాలకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు త్రివిక్రమ్.
ఇప్పుడు పవన్ మరో రీమేక్ బాధ్యతలను త్రివిక్రమ్ చేతిలో పెట్టారట. సముద్రఖని దర్శకత్వంలో తమిళ్ లో వచ్చిన 'వినోదయ సితం' సినిమాని పవన్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో సముద్రఖని లేదా సాహో డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ స్క్రిప్ట్ బాధ్యతలను త్రివిక్రమ్ హ్యాండిల్ చేస్తున్నారట.
ఈ సినిమా కోసం పవన్ కేవలం 20 రోజుల కాల్ షీట్స్ మాత్రమే కేటాయించారట. ఇందులో పవన్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ కూడా నటించనున్నాడట. ఉగాది కానుకగా సినిమా గ్రాండ్ గా లాంచ్ కానుందని టాక్.