త్రివిక్రమ్ ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ.. హీరో ఎవరో తెలుసా..

ఇన్నాళ్లూ తెలుగుకే పరిమితం అయిన త్రివిక్రమ్ మాటల మంత్రం త్వరలోనే ప్యాన్ ఇండియా స్థాయిలో వినిపించబోతోంది. అది కూడా మైథాలజీ కథతో అంటున్నారు. మరి ఈ కథలో హీరో ఎవరో తెలుసా..? ఇంకెవరు.. త్రివిక్రమ్ కు బాగా ఇష్టమైన అల్లు అర్జున్.;

Update: 2024-07-19 15:51 GMT

గుంటూరు కారం డిజాస్టర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కసారిగా డీలా పడ్డాడు. కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా ఆయన మాటలపై విమర్శలు వచ్చాయి. టేకింగ్, స్క్రీన్ ప్లే పైనా కమెంట్స్ వచ్చాయి. చాలామంది ఓపెన్ గానే ఈ డిజాస్టర్ కు త్రివిక్రమ్ మాత్రమే కారణం అన్నట్టుగా మాట్లాడారు. ఆ విషయంలో ఆయన కొంత మనస్థాపం చెందారు అనే వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కాదు. ఆయన ఈ సారి నెక్ట్స్ లెవల్ సినిమా చేయడానికి తీసుకున్న నిశ్శబ్ధం. ఇన్నాళ్లూ తెలుగుకే పరిమితం అయిన త్రివిక్రమ్ మాటల మంత్రం త్వరలోనే ప్యాన్ ఇండియా స్థాయిలో వినిపించబోతోంది. అది కూడా మైథాలజీ కథతో అంటున్నారు. మరి ఈ కథలో హీరో ఎవరో తెలుసా..? ఇంకెవరు.. త్రివిక్రమ్ కు బాగా ఇష్టమైన అల్లు అర్జున్.

యస్ .. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమా త్రివిక్రమ్ తోనే అని అఫీషియల్ గానే కన్ఫార్మ్ అయింది. ఐకన్ స్టార్ సన్నిహితుడు బన్నీ వాస్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యొస్ట్ బడ్జెట్ తో రూపొందే సినిమా అని కూడా చెప్పాడు. ఆ బడ్జెట్ కోసం హారిక హాసినితో పాటు గీతా ఆర్ట్స్ బ్యానర్స్ కూడా ఇంకా చాలా అప్పులు చేయాల్సినంత బడ్జెట్ అన్నాడు.

కొన్నాళ్ల క్రితం మహా భారతం గురించి మాట్లాడాడు త్రివిక్రమ్. అందుకే అతను ఆ కథనే చెప్పబోతున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే అల్లు అర్జున్ ను అర్జునుడుగా చూపించబోతున్నాడు అంటున్నారు. మొత్తంగా త్రివిక్రమ్ ఈ సారి చాలా కసిగా ఉన్నాడు. ఇటు ఐకన్ స్టార్ కు ఆల్రెడీ ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఆ ఫేస్ తో త్రివిక్రమ్ కూడా కంట్రీ మొత్తం షేక్ అయ్యే ఓ సాలిడ్ హిట్ కొడితే.. ఆయన కూడా ప్యాన్ ఇండియా డైరెక్టర్ల లిస్ట్ లోకి వెళతాడు. మొత్తంగా ఈ అప్డేట్ తో అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ మేటర్ కూడా బయటకు వచ్చినట్టే.

Tags:    

Similar News