Jabardasth: జబర్దస్త్‌కు కమెడియన్ల కొరత.. గుడ్‌బై చెప్పిన మరో ఇద్దరు..
Jabardasth: జబర్దస్త్ అనే ఒక్క స్టాండప్ కామెడీ షో ఎంతోమందికి ఎన్నో రకాలుగా లైఫ్ ఇచ్చింది.;
Jabardasth: జబర్దస్త్ అనే ఒక్క స్టాండప్ కామెడీ షో ఎంతోమందికి ఎన్నో రకాలుగా లైఫ్ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో చాలావరకు కనిపిస్తున్న అప్‌కమింగ్ కమెడియన్స్ ఈ స్టేజ్ నుండి వచ్చినవారే. కానీ ఒక్కొక్కరిగా ఈ షో నుండి కమెడియన్స్ అందరూ బయటికి వచ్చేస్తున్నారు. తాజాగా మరో ఇద్దరు కమెడియన్స్ కూడా వేరే ఛానెల్‌కు షిఫ్ట్ అయిపోయినట్టు తెలుస్తోంది.
రోజా, నాగబాబు జడ్జిలుగా జబర్దస్త్ ప్రారంభమయ్యింది. చాలా సంవత్సరాల వరకు వీరిద్దరే జడ్జిలుగా కొనసాగారు కూడా. కానీ మధ్యలో నాగబాబు తప్పుకుని వేరే ఛానెల్‌కు వెళ్లి తానే సొంతంగా ఓ స్టాండప్ కామెడీ షోను ప్రారంభించాడు. ఆయన వెళ్లిపోయిన తర్వాత కూడా చాలామంది టీమ్ లీడర్లు వేరే షోలకు వెళ్లడం ప్రారంభమయ్యింది.
అదిరే అభి.. జబర్దస్త్‌లో చాలాకాలం నుండి టీమ్ లీడర్‌గా కొనసాగుతున్న కమెడియన్. తాజాగా అభి కూడా వేరే కామెడీ షోకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఆ షో స్టేజ్‌పై తాను దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అభి. తనతో పాటు ఈ ఫోటోలో జబర్దస్త్ జీవన్ కూడా ఉన్నాడు. దీంతో జబర్దస్త్‌కు మరో షాక్ తగిలింది అనుకుంటున్నారు ప్రేక్షకులు.