Unstoppable - 4 : బాబు గారు బాలయ్య ప్రోమ్ అదుర్స్

Update: 2024-10-22 07:53 GMT

నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ అంటేనే అన్ని రసాలూ ఉంటాయి. అది అన్ స్టాపబుల్ మూడు సీజన్స్ లోనూ కనిపించింది. ఈ నెల 25 నుంచి నాలుగో సీజన్ స్టార్ట్ కాబోతోంది. ఈ సారి ఫస్ట్ గెస్ట్ గా ఆంధ్ర ప్రదేశే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. రీసెంట్ గానే షూటింగ్ జరిగిన ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఎన్నికల తర్వాత టాక్ షో కాబట్టి హాట్ హాట్ గా ఉంటుందనుకున్నారు చాలామంది. బట్.. మొదట ఎమోషనల్ గా స్టార్ట్ అయ్యి తర్వాత కంప్లీట్ ఎంటర్టైనర్ గా మారింది. అయితే ఇంతకు ముందు లేని విధంగా ఈ షో ప్రారంభంలోనే కోర్ట్ లో భగవద్గీత మీద ఒట్టు వేయించినట్టు.. బాలయ్య కూడా ఓ ఒట్టు వేయించాడు. ‘చంద్రబాబు నాయుడు అనే నేను.. బాలకృష్ణ మీద ప్రేమతో.. ఏదడితే దానికి నవ్వుతూ సమాధానం చెబుతానని..’అంటూ బాలయ్య చెప్పగానే అన్నీ రిపీట్ చేసిన బాబుగారు.. నవ్వుతూ అన్న చోట ‘సమయస్ఫూర్తితో’అని సవరించాడు. అంతే కాదు.. నీ మీద బెట్టు అని బాలయ్య తల మీద చెయ్యి వేయబోయాడు.. అంతలోనే అమ్మా అంటూ నవ్వుతూ తప్పుకున్నాడు బాలయ్య. తర్వాత మీ ఛమత్కారం మీది.. మా సమయస్ఫూర్తి మాది అంటూ చంద్రబాబు పూర్తి చేశాడు.

ప్రోమోలో మొదటి ప్రశ్నగా.. చంద్రబాబు అరెస్ట్ కు సంబంధించి అడిగినప్పుడు ఆయన చాలా ఎమోషనల్ అయ్యాడు. జైల్లో తన గడిపిన ప్రతి రోజూ బాధించారని చెప్పినప్పుడు అక్కడున్న ప్రేక్షకులు కూడా ఎమోషనల్ గా మారి కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి తను తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం.. అదీ జైల్లో తీసుకోవడం వెనక ఉన్న కారణాలు వివరించారు.. అది ఎపిసోడ్ లో చూడాలి.

ఇక ఆ తర్వాత అన్నీ ఫన్ క్వశ్చన్సే ఉన్నాయి. బాలయ్య తన చెల్లెలు భువనేశ్వరి, కూతురు బ్రాహ్మణిలను ప్రస్తావించి .. ఎవరు ఇంట్లో బాస్ అని అడిగినప్పుడు చంద్రబాబు అదే మాకు తెలియడం లేదు అన్నాడు. దీంతో మేం బాగా ట్రెయిన్ చేసి పంపించాం అనడంతో నవ్వులు పూశాయి. ఇక వీరి మనవడు దేవాన్ష్ కూడా కొన్ని ప్రశ్నలు అడగటం.. తర్వాత ఇద్దరూ పర్సనల్ ప్రశ్నలు, సమాధానాలతో చాలా సరదాగా ఉందీ ప్రోమో. అయితే గతంలో చంద్రబాబు వచ్చినప్పటి ఎపిసోడ్ కంటే ఈ ఎపిసోడ్ హైలెట్ కాబోతోందని.. సీజన్ 4లో ఫస్ట్ ఎపిసోడే బెస్ట్ గా మారబోతోందనేది స్పష్టంగా తెలుస్తోంది. 

Tags:    

Similar News