Unstoppable with NBK: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోకు అప్‌కమింగ్ గెస్ట్‌లు వీరే..
Unstoppable with NBK: నందమూరి బాలకృష్ణ స్క్రీన్‌పై కనిపిస్తే థియేటర్ అంతా విజిల్స్, క్లాప్స్‌తో మోత మోగాల్సిందే.;
Unstoppable with NBK: నందమూరి బాలకృష్ణ స్క్రీన్‌పై కనిపిస్తే థియేటర్ అంతా విజిల్స్, క్లాప్స్‌తో మోత మోగాల్సిందే. జై బాలయ్య అనేది ఒక పదం కాకుండా ఒక ఎమోషన్‌లాగా మారిపోయింది. అలాంటి బాలయ్య మన ఇంట్లోని బుల్లితెరపైకి వచ్చేస్తే.. ఎలా ఉంటుంది కదా.. కానీ కొన్నిరోజుల క్రితం వరకు ఈ ఆలోచన తన అభిమానులకు కలలో కూడా రాలేదు. అలాంటి 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షో ద్వారా ఇది నిజమయింది.
'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' టాక్ షోలో మొదటి ఎపిసోడ్ కోసం మంచు ఫ్యామిలీని పిలిచారు బాలయ్య. మోహన్ బాబు, మంచు లక్ష్మి, విష్ణులతో కలిసి బాలయ్య చేసిన అల్లరి, చెప్పుకున్న సరదా కబుర్లు అన్నీ దీపావళి రోజున మన ముందుకు రానున్నాయి. ఇటీవల ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలయ్యి తెగ వైరల్ అవుతోంది. మరి తరువాతి ఎపిసోడ్లకు గెస్ట్‌లు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టుగా అనిపిస్తోంది.
దాదాపు అయిదు ఎపిసోడ్ల వరకు 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'కు రావాల్సిన గెస్ట్‌లు ఎవరో నిర్ణయించేసిందట ఆహా టీమ్. ఫస్ట్ ఎపిసోడ్ మంచు ఫ్యామిలీతో ముగిశాక సెకండ్ ఎపిసోడ్ కోసం దగ్గుబాటి అబ్బాయి రానా.. అన్‌స్టాపబుల్‌కు రానున్నారట. మూడో ఎపిసోడ్‌కు నేచురల్ స్టార్ నాని రానున్నారని టాక్.
అన్‌స్టాపబుల్‌లోని నాలుగో ఎపిసోడ్ కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను పిలిచే ప్రయత్నం చేస్తోందట ఆహా. ఇక అయిదో ఎపిసోడ్‌కు యంగ్ టైగర్ ఎన్‌టీఆర్‌ను రంగంలోకి దించనున్నారట. వీరందరి కంటే బాలయ్య సీనియర్.. అయినా కూడా అందరితో ఒక ఫ్రెండ్‌లాగా కలిసిపోతారు. అందుకే వీరి మధ్య జరిగే కబుర్లను వినాలని ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.