హీరో రాంచరణ్ తేజ్ సతీమణి ఉపాసన నటీమణి జాన్వీకపూర్ కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఉపాసన, ఆమె అత్తగారు సురేఖ కొణిదెల జాయింట్ గా అత్తమ్మాస్ కిచెన్ పేరిట తెలుగు ఆహార ఉత్పత్తుల బిజినెస్ ప్రారంభించడం తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆర్సీ16 మూవీ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ ముద్దుగు మ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన జాన్వీకి అత్తమ్మా స్ కిచెన్ నుంచి ఓ కిట్ బాక్స్ అందింది. ఈ బాక్స్ ను ఉపాసన స్వయంగా అందించడం విశేషం. రామ్ చరణ్, జాన్వీ ఆర్డర్ బుక్ చేస్తే ఇవాళ డెలివరీ ఇచ్చినట్టు అత్తమ్మాస్ కిచెన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఇంతకీ ఆర్సీ 16 సెట్స్ పై ఏం వండబోతున్నారు?.. వేచి చూడండి! అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోస్ట్ వైరల్ గా మారింది. ఇక పోతే ఆర్సీ 16 సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దేవర తర్వాత జాన్వీకి ఇది తెలుగులో రెండో సినిమా. వీటితో పాటు మరికొన్ని తెలుగు సినిమాలకు సైన్ చేసేందుకు ఈ ముద్దుగుమ్మ రెడీ అవుతోందని సమాచారం. ఇక జాన్వీ ముంబైలో ఉంటున్నప్పటికీ దక్షిణాదితోనూ మంచి అనుబంధం ఉంది. వీలు దొరికనప్పుడల్లా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటుందీ అందాల తార. అంతే కాదు జాన్వీకి దక్షిణాది వంటకాలంటే బాగా ఇష్టం.