Upendra vs. Sudeep : ఉపేంద్ర వర్సెస్ సుదీప్.. కన్నడ నుంచి నెక్ట్స్ ఎవరు..?

Update: 2024-09-02 13:20 GMT

ప్యాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీ. రాజమౌళి పుణ్యమా అని కొత్త మార్కెట్ వచ్చింది. దీంతో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్స్ పెరిగారు. దాన్ని ఇమ్మీడియొట్ గా క్యాష్ చేసుకున్న పరిశ్రమ శాండల్ వుడ్. కేజీఎఫ్ తో అప్పటి వరకూ అక్కడ టైర్ 2 హీరోగా ఉన్న యశ్ ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇటు తెలుగు నుంచి పుష్పతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కన్నడ నుంచి కాంతారతో రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా పెద్ద స్టార్ అయ్యాడు.

అయితే ప్యాన్ ఇండియా మార్కెట్ కోసం శాండల్ వుడ్ హీరోలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కిచ్చ సుదీప్ ఇంతకు ముందు విక్రాంత్ రోణా అనే సినిమా చేశాడు. కానీ వర్కవుట్ అవలేదు. అయినా మరోసారి ఆ చిత్ర దర్శకుడు.. అనూప్ భండారితోనే మరోసారి ప్యాన్ ఇండియా సినిమా అంటూ అనౌన్స్ చేశాడు. ఆర్ఆర్ఆర్ లాగా ఇతను ‘బి.ఆర్.బి’ అనే టైటిల్ ను తన బర్త్ డే స్పెషల్ గా విడుదల చేశాడు. అంటే ‘బిల్లా రంగా బాద్ షా’అని అర్థమట. ఇంకా పూర్తి డీటెయిల్స్ రాలేదు కానీ.. ఇది ప్యాన్ ఇండియా సినిమా అని బల్లగుద్ది మరీ ప్రకటించారు.

ఇక ఈ ‘బి.ఆర్.బి’ని హను మాన్ తో ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మించబోతున్నాడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందబోతోంది.

ఇక ప్యాన్ ఇండియా కాదు కానీ.. సౌత్ మొత్తం ఎప్పుడో క్రేజ్ తెచ్చుకున్న స్టార్ ఉపేంద్ర కూడా చాలా రోజుల ముందే ‘యూ.ఐ’ అనే టైటిల్ తో తనే దర్శకత్వం చేస్తూ ఓ మూవీ రూపొందిస్తున్నాడు. ఇది కూడా ప్యాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేసే కంటెంట్ అని ముందు నుంచీ చెబుతున్నారు. ఉపేంద్ర మూవీ అంటే కాస్త డైనమిక్ గా ఉంటుంది. డేరింగ్ గా చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు. ఓవర్ ద బోర్డ్ ఆలోచిస్తాడు. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ టైటిల్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ వరకూ నెక్ట్స్ లెవల్ లో కనిపించాయి. ఈ మూవీతో ఉపేంద్ర ప్యాన్ ఇండియా హీరో కాబోతున్నాడు అనే టాక్ బలంగా ఉంది. అక్టోబర్ లోనే ఈ సినిమా విడుదల కాబోతోంది. మరి ఉప్పీకి ప్యాన్ ఇండియా మార్కెట్ వస్తుందా లేదా అనేది అప్పుడే చెప్పలేం కానీ.. తన సమకాలీకుడైన సుదీప్ కూడా ఇదే ప్రయత్నాల్లో ఉన్నాడు కాబట్టి.. ఈ ఇద్దరు హీరోలూ కన్నడ ఇండస్ట్రీ నుంచి కాబోయే ప్యాన్ ఇండియా స్టార్లు అవుతారా అనేది అక్కడ హాట్ టాపిక్ గా ఉంది. 

Tags:    

Similar News