Ravi Teja : కురిసిందే వాన.. భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్

Update: 2025-12-19 11:14 GMT

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. రిలీజ్ ఆకట్టుకునేలా ఉంది. రవితేజ ఇమేజ్ కు భిన్నంగా ఉండేలా కనిపిస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటే అతను భార్య ఉండగా మరో అమ్మాయితో ప్రేమలో పడిపోయిన వ్యక్తిలా కనిపించే వ్యక్తి అనగానే అర్థం ఉంటుంది అనిపించేలా ఉంది ఈ టైటిల్. సింపుల్ గా టీజర్ చూస్తే హీరో ఫస్ట్ సైకాలజీ డాక్టర్ ను కలవడానికి వెళ్లడం.. అక్కడ తన భార్యతో పాటు మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు అనిపించడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఉండటం కనిపిస్తుంది. కురిసింది వానా నా గుండెలోనా అంటూ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వస్తుంటుందే.. అతను ఆ అమ్మాయితో ప్రేమలో మునిగిపోయేలా ఉంటుంది. దాంట్లో ప్రాబ్లమ్ ఏం ఉంది అని డాక్టర్ అడిగితే.. ‘నాకర్థం కావట్లేదు సార్.. నా భార్యకు ప్రాణం’అంటాడు. కట్ చేస్తే అతనికి భార్య ఉండగా మరో అమ్మాయితో ఎఫైర్ లో ఉంటాడు అన్నమాట. ‘రామ్ ని అనుమానించడమా.. మగాళ్లకు ఎలా ఉండాలి అన్నదానికి రోల్ మోడల్ రామ్’అని ఆ అమ్మాయి చెబుతుంది.

చివర్లో ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని ఆ ఎఫైర్ ఉన్న అమ్మాయి అడిగితే.. ‘అన్నా వదినా వాళ్ల అబ్బాయి.. నేను..ఒదినోళ్ల చెల్లి’అని చెబుతాడు. అదీ మేటర్.. ఈ మధ్య కాలంలో రవితేజ చేసిన మూవీస్ కు భిన్నంగా ఉండేలా ఉంది. ఈ పాయింట్ లో ఎలాంటి కొత్తదనం లేకపోయినా ట్రీట్మెంట్ మాత్రం బావుంటుంది అనిపించేలా ఉంది. సంక్రాంతికి విడుదల కాబోతోన్న ఈ మూవీతో మాస్ రాజా బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడు.

రవితేజ సరసన అషికా రంగనాథ్, డింపుల్ హయాతీ హీరోయిన్లుగా నటించారు. సునిల్, సత్య, వెన్నెల కిశోర్ ఇతర పాత్రల్లో కనిపించబోతున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించబోతున్న ఈ మూవీ ఆకట్టుకునేలానే ఉంది. 

Full View

Tags:    

Similar News