Urvashi Rautela : ఆయన ఒక లెజెండ్ ... బాలకృష్ణపై ఊర్వశి ప్రశంసలు వర్షం

Update: 2024-09-30 13:30 GMT

ప్రముఖ నటి ఊర్వశి రౌతేలా నందమూరి బాలకృష్ణపై ప్రశంసలు వర్షం కురిపించింది. ప్రస్తుతం ఆమె బాలకృష్ణ ఎన్బీకే109 మూవీలో నటిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె బాలకృష్ణ గురించి మాట్లాడుతూ" నేను చాలా మంది పెద్ద హీరోలతో నటించాను. కానీ బాలకృష్ణ చాలా స్పెషల్. ఆయన ఒక లెజెండ్. పని పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. ఇతరులను చూసుకునే విధానం కూడా చాలా బాగుంటుంది. మరీ ముఖ్యంగా మహిళలతో చాలా మర్యాదగా నడుచుకుంటారు. అందుకే ఆయనంటే నాకు చాలా అభిమానం" అని చెప్పుకొచ్చింది ఊర్వశి. ప్రస్తుతం ఆమె బాలకృష్ణ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇక టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ వయ్యారి పరిచయమే.. స్పెషల్ సాంగ్స్ లో మెప్పించి టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఊర్వశీ రౌతేలా. ఇక ఈ భామ 15 సంవత్సరాల వయస్సులో తన మోడలింగ్ కెరీర్ ను ప్రారంభించింది. గతంలో మిస్ టీన్ ఇండియా 2009 టైటిల్‌ను కూడా గెలుచుకుంది ఊర్వశి. 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

Tags:    

Similar News