ఇండియన్ క్రికెటర్ వరుణ్ చక్రవర్తి పేరు తెలియని వాళ్లుండరు ఈ జెనరేషన్ లో. ప్రస్తుతం టీమ్ ఇండియాలో స్థిరంగా రాణిస్తున్నాడు. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో తిరుగులేని ప్రదర్శనతో అదరగొట్టాడు. అలాంటి వరుణ్ క్రికెటర్ కావడానికి తొలినాళ్లలో చాలా ఇబ్బందులే ఫేస్ చేశానని చెప్పాడు. మొదట బ్యాటర్ కావాలనుకున్నాడట. ఏదో యాక్సిడెంట్ కావడంతో కొన్నాళ్లు బెడ్ కే పరిమితం అయ్యాడు. తర్వాత స్పిన్నర్ గా మారి మెళకువలు నేర్చుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కీలకంగా ఆడాడు.
లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ ఓ ఇంట్రెస్టింగ్ విషయం పంచుకున్నాడు. తను తమిళ్ టాప్ స్టార్ విజయ్ కి పెద్ద అభిమాని అంట. తన ఒంటిపై విజయ్ పేరును టాటూగా వేయించుకున్నాడట. అంటే విజయ్ అంటే అతనికి ఎంత పెద్ద అభిమానమో వేరకే చెప్పక్కర్లేదు. అంతే కాదు.. ఆ టైమ్ లో కొన్ని స్క్రిప్ట్స్ కూడా విజయ్ కోసం రాసుకున్నాడట. కుదిరితే అతన్ని డైరెక్ట్ చేయాలనే ఈ కథలు రాసుకున్నా అన్నాడు. మరి ఇప్పుడేమైనా ప్రయత్నిస్తారా అంటే ప్రస్తుతం తన రూట్ వేరేగా ఉందన్నాడు. మామూలుగా క్రికెటర్స్ కూడా ఫ్యాన్ బేస్ లో హీరోలను మించి పోతుంటారు. కాకపోతే ఈ తరం క్రికెటర్స్ అంతా ఏదో ఒక హీరోకు అభిమానిగానే ఉంటున్నారు. అలా వరుణ్ కూడా విజయ్ కి వీరాభిమానినని హ్యాపీగా చెబుతున్నాడు.
విశేషం ఏంటంటే.. కోలీవుడ్ లో ఫ్యాన్స్ విషయంలో విజయ్, అజిత్ అభిమానుల మధ్య పోటీ ఉంటుంది. అయితే వరుణ్ ఫ్రెండ్స్ ఆరుగురులో ఒక ముగ్గురు విజయ్ ఫ్యాన్స్ అయితే ముగ్గురు అజిత్ ఫ్యాన్సట.