వరదలతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సహాయంగా రూ.15 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు నటుడు వరుణ్ తేజ్ ట్విటర్‌లో ప్రకటించారు. వరదల వలన రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బంది పడుతున్న ప్రజల సహాయం కోసం నా వంతు బాధ్యతగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిసహాయ నిధికి చెరొక రూ.5 లక్షలు.. గౌరవ ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించిన పంచాయితీ రాజ్ శాఖకు రూ. 5 లక్షలు.. మొత్తం రూ. 15 లక్షలు విరాళంగా అందిస్తున్నాను. ఈ కష్టకాలంలో అందరం ఒకరికొకరం అండగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని వెల్లడించారు. కాగా ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్,రామ్ చరణ్ ఇలా చాలా మంది స్టార్స్ విరాళం ప్రకటించారు.