వెంకీ, బాలయ్య అన్ స్టాపబుల్ ప్రోమో

Update: 2024-12-24 07:15 GMT

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు ఎంటైర్ తెలుగు ఆడియన్స్ ఫ్యాన్స్ అయిపోయారు. ఆయన హోస్టింగ్ స్కిల్స్ చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఆహా ప్లాట్ ఫామ్ లో ఇప్పటికే మూడు సీజన్స్ ను పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ ప్రస్తుతం 4వ సీజన్ సాగుతోంది. ఈ సీజన్ లో ఎక్కువగా కొత్త సినిమాల ప్రమోషన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి అనే కామెంట్స్ వచ్చాయి. అలాగే భారీ స్థాయిలో సాగిన షో.. ఈ సీజన్ లో చాలా చిన్న ఆర్టిస్టులతో కనిపించడం కొంతమందికి నిరాశ కలిగించింది. బట్ తాజాగా వచ్చిన ప్రోమో మాత్రం అదిరిపోయింది.

విక్టరీ వెంకటేష్ తో అన్ స్టాపబుల్ ఎపిసోడ్ రాబోతోంది. రీసెంట్ గానే షూటింగ్ జరుపుకున్న ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. బాలయ్య, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున టాలీవుడ్ కు నాలుగు స్తంభాలుగా చెప్పుకున్నారు. అదే విషయాన్ని షోలో బాలయ్య కూడా చెప్పాడు. అలాగే నలుగురిలో రాముడు మంచి బాలుడు అని బాలయ్య అనగానే.. ‘హలో కొంపదీసి నువ్వనుకుంటున్నవా’ అని వెంకటేష్ సరదాగా అనడం ఫ్యాన్స్ కూ నచ్చేలా ఉంది. అలాగే వెంకీతో పాటు తామంతా చెన్నైలో ఉన్నప్పుడు హవా చేశాం అని బాలయ్య చెప్పడం బావుంది. నాగ చైతన్య ఫోటో చూపించినప్పుడు.. ‘చాలామంది పిల్లలని హగ్ చేస్తాం.. కానీ వీడిని హగ్ చస్తే తెలియని ఆనందం..’అనడం చాలామందికి నచ్చింది. వెంకీతో పాటు సురేష్ బాబు కూడా షోకు రావడం మరింత ప్లెజెంట్ గా మారింది. అన్నదమ్ములిద్దరితోనూ బాలయ్య ఫన్ తో పాటు ఎమోషన్ ను కూడా రప్పించాడు. వెంకటేష్, సురేష్ బాబు తమ తండ్రి రామానాయుడును తలచుకుని కన్నీళ్లు పెట్టుకోవడం కదిలించింది.

ఇక బాలయ్య మాస్ డైలాగ్ ‘కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తాను’ను వెంకీ చెప్పడం.. వెంకీ మాస్ డైలాగ్ ‘ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్’ ను బాలయ్య చెప్పడం ఎంటర్టైనింగ్ గా ఉంది. షో చివర్లో సంక్రాంతికి వస్తున్నాం దర్శకుడు అనిల్ రావిపూడి ఎంట్రీ కూడా ఫన్నీగా ఉంది. మొత్తంగా చాలా రోజుల తర్వాత ప్రాపర్ అన్ స్టాపబుల్ షో చూడబోతున్నాం.. అనిపించేలా ఉంది. అఫ్ కోర్స్ ఇందులోనూ ప్రమోషనల్ మెటీరియల్ ఉంటుంది. కానీ దానికి మించిన ఎక్స్ పీరియన్స్ ను ఈ ఎపిసోడ్ ఇవ్వబోతోందని అర్థం అవుతోంది. ఈ ఎపిసోడ్ ఈ నెల ౨౭ నుంచి స్ట్రీమ్ కాబోతోంది.

Full View

Tags:    

Similar News