Nari Nari Naduma Murari : నారీ నారీ నడుమ మురారి విడుదలవుతుందా..?

Update: 2025-12-30 09:08 GMT

నారీ నారీ నడుమ మురారి 1990లో విడుదలైన సినిమా. సూపర్ హిట్ గా నిలిచిందీ చిత్రం. బాలయ్య హీరోగా శోభన, నిరోషా హీరోయిన్లుగా శారద, సత్యనారాయణ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ఎవర్ గ్రీన్ గా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత అదే టైటిల్ తో ఓ కొత్త సినిమా వస్తోందంటే ఖచ్చితంగా ఎంతోకొంత ఆసక్తి ఉంది. బట్ ఈ మూవీ విషయంలో మాత్రం ఆ ఆసక్తిని కలిగించలేకపోతోంది. ఈ సంక్రాంతి బరిలో జనవరి 14న విడుదల కాబోతోంది అని చెప్పారు. బట్ ప్రమోషన్స్ లో మాత్రం పరమ దారుణంగా ఉండిపోయిందీ మూవీ.

శర్వానంద్ హీరోగా సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. రీసెంట్ గా వచ్చిన టీజర్ మాత్రం ఆకట్టుకుంది. బట్ తర్వాత మాత్రం ఈ సినిమా గురించి అస్సలు పట్టించుకున్నట్టు లేరు మేకర్స్. రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ పరంగా మాత్రం చాలా డల్ గా అయిపోయింది. ఎవరూ పట్టించుకోవడం లేదీ మూవీ గురించి. రిలీజ్ కు తక్కువ టైమ్ ఉంది. అంత తక్కువ టైమ్ లో వీళ్లు కనీసం ఏదో ఒకటి ఆడియన్స్ లో క్రేజ్ తీసుకు రావాల్సి ఉంది. బట్ ఆ విషయంలో మేకర్స్ మాత్రం చాలా లైట్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది.

అసలే సంక్రాంతి టైమ్ లో చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి. జనవరి 9నుంచే ప్రభాస్ రాజా సాబ్ తో మొదలవుతోంది. తర్వాత జన నాయకుడు, మనశంకర వర ప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, భర్తలకు మహాశయులకు విజ్ఞప్తి అంటూ వరుసగా మూవీస్ ఉన్నాయి. దీంతో పాటు పరాశక్తి అనే డబ్బింగ్ మూవీ కూడా జనవరి 10నే రిలీజ్ కాబోతోంది. మరి ఇంత హార్డ్ టైమ్ లో వీళ్లు అంత లైట్ గా తీసుకోవడం చూస్తుంటే అసలు మూవీ విడుదలవుతుందా అనే డౌట్స్ మాత్రం పెరుగుతున్నాయి. మరి ఇప్పటికైనా ఈ మూవీ ప్రమోషన్స్ పై ఎక్కువ దృష్టి పెడితే బెటర్. లేదంటే నిజంగానే సంక్రాంతి బరిలో నష్టపోతుంది.. లేదంటే వాయిదా పడుతుంది. 

Tags:    

Similar News