Vicky Kaushal: 'మహావతార్' కోసం మాంసం, మద్యం ముట్టనని ఒట్టు పెట్టుకున్న విక్కీ..
పౌరాణిక చిత్రాల్లో పవర్ ఫుల్ పాత్రలు పోషించే నటీనటులు చాలా నిష్టంగా ఆ పాత్రలు చేస్తుంటారు. ఇప్పుడు అదే కోవలోకి బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ కూడా వెళ్లారు. తాను చేస్తున్న మహావతార్ చిత్రంలోని పరశురాముడి పాత్ర కోసం తన ఇష్టా ఇష్టాలను పక్కన పెట్టేశారు.
అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న మహావతార్ లో విక్కీ కౌశల్ పరశురాముడి పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. గత సంవత్సరం నవంబర్‌లో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులలో చాలా ఆసక్తిని రేకెత్తించింది. అందరూ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలి నివేదిక ప్రకారం, ఈ సినిమా కోసం ప్రిపరేషన్‌లో భాగంగా విక్కీ, అమర్ మద్యం, మాంసాహారం మానేస్తున్నారని ఇండస్ట్రీ సమాచారం.
"మహావతార్ లాంటి సినిమాకి పూర్తి నిబద్ధత అవసరం. సినిమా చూసే ప్రేక్షకులకు దానిని స్వచ్ఛమైన దృశ్యంగా మార్చడానికి తమ బెస్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది మధ్యలో గ్రాండ్ పూజా వేడుకతో సినిమా కోసం తమ సన్నాహాలు ప్రారంభిస్తారు" అని సినిమా యూనిట్ తెలిపింది.
"అమర్ ఇప్పటికే ఆహారపు అలవాట్లను మార్చుకున్నప్పటికీ, విక్కీ లవ్ అండ్ వార్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత తాను కూడా మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. పరశురాముడి పాత్రకు తగిన గౌరవం చూపించే మార్గం ఇది" అని ఆ వర్గాలు తెలిపాయి.