Venkatesh : 100 కోట్ల షేర్.. ఇది కదా బాక్సాఫీస్ కా ‘షేర్’ అంటే

Update: 2025-01-20 09:45 GMT

ఓ మీడియం రేంజ్ సినిమా. గ్రాఫిక్స్ లేవు. విజువల్ ఎఫెక్ట్స్ అవసరం లేదు. భారీ బడ్జెట్ కోరుకోని కథ. కేవలం ఆర్టిస్టుల ఇమేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి సత్తా ప్రకారంగా రూపొందిన సినిమా. అలాంటి మూవీస్ మహా అయితే బడ్జెట్ ను రికవర్ చేసుకుని ఆ మొత్తం స్థాయిలో లాభాలు తెస్తాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా అలా కాదు. కొన్నవాళ్లంతా డబుల్ ప్రాఫిట్స్ చూసేలాంటి కలెక్షన్స్ తో అదరగొడుతోంది. ఏకంగా 100 కోట్ల షేర్ వసూలు చేసి వాహ్ అనిపిస్తోంది. చిరంజీవి తర్వాత వంద కోట్ల షేర్ ఉన్న సీనియర్ హీరో వెంకటేష్ మాత్రమే కావడం విశేషం. రోజు రోజుకూ వసూళ్లు పెరుగుతున్నాయన్న పోస్టర్లే కానీ.. తగ్గడం అనేదే లేదు. అదీ కాక వీరికంటే ముందు విడుదలైన సంక్రాంతి సినిమాలను తీసేసి మరీ ఈ మూవీని ఆ థియేటర్స్ వేస్తున్నారు. అదీ ఒక సినిమా బిగ్గెస్ట్ అనడానికి నిదర్శనం.

నిజానికి ఈ సినిమాలో ఏముందీ అంటే.. కంటెంట్ పరంగా చూస్తే సిల్లీగా కనిపిస్తుంది. కానీ కథనంతో నవ్వించారు. డైలాగ్స్ తో కవ్వించారు. పాత్రల తాలూకూ క్యారెక్టరైజేషన్స్ నుంచి ఫన్ క్రియేట్ చేశారు. అందుకు హీరో ఇమేజ్ ఎసెట్ అయితే.. దర్శకుడి ‘పెన్ తనం’మరోసారి కలిసొచ్చింది. ఓ రకంగా కలిసొచ్చిన కాంబినేషన్ కదం తొక్కితే కాసుల తుఫాన్ కురుస్తోందని చెప్పాలి.

భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ రిలీజ్ కు ముందే ఈ మూవీకి పూర్తి పాజిటివ్ వైబ్స్ ను తీసుకువస్తే.. ఏ మాత్రం అసభ్యత, అశ్లీలత లేని హీరోయిన్ల పాత్రలూ, వారి భయాలు, ఓ రేంజ్ లో హైప్ ఇచ్చిన హీరో మోకాళ్లు, మోచేతుల నొప్పులతో ఇబ్బంది పడుతున్నాడని తెలిసిన ప్రేక్షకులు నవ్వుకున్నారంటే అది ఆ పాత్రకు ఉన్న ఇమేజ్. లేదా తన ఇమేజ్ ను ఇలాంటి పాత్రకు ఎప్పుడో షిఫ్ట్ చేసిన వెంకీ కెపాసిటీ ఇది. నిజానికి ఈ రోజుల్లో 100 కోట్ల షేర్ అనే మాట చాలా పెద్దది. అది కూడా వెటరన్ హీరోలకు సంబంధించి. అలాంటి ఫీట్ ను సాధించిన వెంకటేష్.. ఈ ఏజ్ లో తనకంటూ ఓ లైఫ్ టైమ్ మెమరీని క్రియేట్ చేసుకున్నాడు అనే చెప్పాలి. 

 

Tags:    

Similar News