Vijay Devarakonda : విజయ్, సితారలో మరో సినిమా.. దర్శకుడెవరంటే

Update: 2025-08-12 10:45 GMT

పేరులో ఉన్న విజయం కెరీర్ లో కనిపించడం లేదు విజయ్ దేవరకొండకి. రీసెంట్ గా వచ్చిన కింగ్ డమ్ కు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ అవి బ్లాక్ బస్టర్ గా టర్న్ కాలేదు. కింగ్ డమ్ సెకండ్ హాఫ్ మైనస్ అయిందనే టాక్ బలంగా వెళ్లింది. దీంతో కలెక్షన్స్ తగ్గాయి. అయినా వీళ్లు హిట్ అనే అనుకుంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈమూవీ అయినా విజయ్ కి హిట్ అవుతుందనుకున్నారు. కానీ అవలేదు. అయితే విజయ్ కి ఓ బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిందే అని సితార ఫిక్స్ అయినట్టుంది. అందుకే అతనితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ దిల్ రాజు బ్యానర్ లో రౌడీ జనార్థన్ అనే సినిమాతో పాటు రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో ఓ పీరియాడిక్ యాక్షన్ మూవీ చేయబోతున్నారు. వీటిలో రాహుల్ మూవీ ముందుగా స్టార్ట్ అవుతుంది. తర్వాతే రౌడీ జనార్థన్. రౌడీ జనార్థన్ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించడం దాదాపు ఖాయం అయింది.

ఆ తర్వాత సితార బ్యానర్ లో సినిమా ఉండబోతోంది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తాడు అనే ప్రచారం జరుగుతోంది. హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం అతను ఉన్న ట్రాక్ రికార్డ్ కి స్టార్ హీరోలెవరూ అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. పైగా టాప్ హీరోలంతా రెండు మూడేళ్లకు సరిపడా ఫుల్ బిజీగా ఉన్నారు. సో.. అతనికి విజయ్ దేవరకొండ అంటే మంచి ఛాయిస్ అనే చెప్పాలి. సో.. ఈ కాంబినేషన్ వర్క్ అవుట్ అయితే ఖచ్చితంగా విజయ్ దేవరకొండకు కూడా పెద్ద ప్లస్ అవుతుందనే చెప్పాలి.

Tags:    

Similar News