Vijay Devarakonda : విజయ్ దేవరకొండ థమ్స్‌అప్ యాడ్ చూశారా?
Vijay Devarakonda : పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారాడు.;
Vijay Devarakonda : పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం లైగర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క యాడ్స్ లలో బిజీగా ఉంటున్నాడు ఈ రౌడీ స్టార్.. తాజాగా థమ్స్‌అప్ యాడ్‌లో కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో రిలీజై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యాడ్ లో నిజంగానే 'తుపాను' ఎలా ఉంటుందో చూపించాడు విజయ్.. కామన్ ఆడియన్‌గా థియేటర్‌లో కూర్చున్న విజయ్ .. కాసేపటికి స్క్రీన్ పైన ప్రత్యేక్షం అవుతాడు. ఇక చివరలో సాఫ్ట్ డ్రింక్ కాదు, బ్రో.. తుపాన్ అని విజయ్ చెప్పిన డైలాగ్‌తో యాడ్ ముగుస్తుంది. మధ్యలో హాలీవుడ్ లెవల్‌లో యాక్షన్ సీన్స్‌ని రూపొందించారు.. ఈ యాడ్ కోసం విజయ్ చాలానే హార్డ్ వర్క్ చేసినట్టుగా కనిపిస్తుంది. కాగా థమ్స్‌అప్ యాడ్‌లో విజయ్ కంటే ముందుగా టాలీవుడ్ హీరోలు చిరంజీవి, మహేష్ బాబు కనిపించారు.