విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన మూవీ కింగ్ డమ్. ఈ గురువారం విడుదలైన ఈ మూవీకి ఊహించని రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చాయి. విజయ్ క్రేజ్ తో పాటు బ్యానర్, డైరెక్టర్ ఇమేజ్ కూడా ఈ మూవీ ఓపెనింగ్స్ లో కీలకం అయ్యాయి అనుకోవచ్చు. అయితే సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ యావరేజ్ అన్నారు రివ్యూవర్స్. అయినా మొదటి రోజు వసూళ్లు బాగా వచ్చాయి. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా కింగ్ డమ్ 39 కోట్లు వసూళ్లు సాధించిందని మేకర్స్ ప్రకటించారు. అయితే నెక్ట్స్ డే అయిన శుక్రవారం మాత్రం కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.
శుక్రవారం రోజు ఈ చిత్రానికి కేవలం 14 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలైంది. ఈ గ్రాస్ తో కలిపి రెండు రోజుల కలెక్షన్స్ 53 కోట్లు అయింది. అంటే ఇది కేవలం గ్రాస్ మాత్రమే. షేర్ గా చూస్తే ఓ 30 కోట్ల వరకూ ఉండొచ్చు. అయినా విజయ్ కెరీర్ లో రెండు రోజుల్లో వచ్చిన వసూళ్లలో ఇదే హయ్యొస్ట్. ఈ శని, ఆదివారాల్లో మరిన్ని వసూళ్లు సాధించే అవకాశాలున్నాయి. ఈ రెండు రోజులూ స్ట్రాంగ్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత వీక్ డేస్ లో పర్ఫార్మెన్స్ ను బట్టి హిట్ రేంజ్ డిసైడ్ అవుతుంది. మొత్తంగా కింగ్ డమ్ రెండు రోజుల్లో 53 కోట్ల గ్రాస్ వసూలు చేసిందన్నమాట.