Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సాఫ్ట్ లుక్.. ఆ సినిమా కోసమేనా..?
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాధ్‌తో కలిసి ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.;
Vijay Deverakonda (tv5news.in)
Vijay Deverakonda: నటీనటులు ఎప్పుడూ ఒకే లుక్‌లో ఉండడం అసాధ్యం. వారు చేస్తున్న సినిమాను బట్టి, అందులోని పాత్రను బట్టి ఎప్పటికప్పుడు వారి లుక్ మారిపోవాల్సి ఉంటుంది. అయితే గతకొంతకాలంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ రఫ్ లుక్‌నే మెయింటేయిన్ చేస్తున్నాడు. ఇక చాలాకాలం తర్వాత మళ్లీ సాఫ్ట్ లుక్‌లోకి మారిపోయాడు విజయ్. అయితే ఇది ఏ సినిమా కోసమో అని ప్రేక్షకుల్లో అప్పుడే సందేహాలు మొదలయిపోయాయి.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాధ్‌తో కలిసి 'లైగర్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. చాలాకాలంగా ఈ సినిమాపైనే తన దృష్టి ఉంది. ఇందులో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అయితే లైగర్ కోసం విజయ్ బాక్సింగ్ మాత్రమే నేర్చుకోవడం కాదు.. తన లుక్‌ను కూడా పూర్తిగా మార్చేశాడు. అయితే ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకోవడంతో విజయ్ మళ్లీ సాఫ్ట్ లుక్‌లోకి మారిపోయాడు.
లైగర్ తర్వాత విజయ్ మళ్లీ.. పూరీ జగన్నాధ్‌తోనే 'జనగణమన' అనే సినిమా చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. కానీ అంతకంటే ముందు విజయ్ కోసం సుకుమార్, శివ నిర్వాణ లైన్‌లో ఉన్నారు. అయితే వీరిలో ఎవరి సినిమా కోసం విజయ్ మళ్లీ ఇలా సాఫ్ట్ అయిపోయాడు అన్న సందేహాలు మొదలయిపోయాయి. ముందుగా వీరిలో ఎవరి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడో అని విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.