విజయ్ దేవరకొండ నటిస్తున్న 12వ చిత్రం ప్రొడక్షన్ లో ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఈ సినిమా టైటిల్ ను, టీజర్ ను బుధవారం విడుదలయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమిళంలో సూర్య, హిందీలో రణ్ బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. తెలుగులో జూ.ఎన్టీఆర్ వాయిస్ ఇస్తున్నారు. దీనికి సంబంధించిన రికార్డింగ్ పూర్తయింది. చాలా సేపు ఎన్టీఆర్ అన్నతోనే ఉన్నా.. వ్యక్తిగత జీవితం, సినిమాలతో పాటుగా ఇతర అంశాల గురించి మాట్లాడుకున్నాం అని విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు. నా సినిమా టీజర్కు వాయిస్ ఇచ్చి ప్రాణం పోశారు. నేను కూడా టీజర్ కోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ అధికారిగా కనిపిస్తారు. మార్చి 28న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.