Vijay Deverakonda : విజయ్ దేవరకొండ టైటిల్ అనౌన్స్ చేస్తారట

Update: 2026-01-24 11:20 GMT

విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపులు చూస్తున్నాడు. భారీ అంచనాలు పెట్టుకున్న కింగ్ డమ్ కూడా దారుణంగా పరాజయం అయింది. అయినా భారీ ప్రాజెక్ట్ లు మాత్రం ఆగడం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా రౌడీ జనార్థన్ మూవీ రాబోతోంది. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని రవి కిరణ్ కోలా డైరెక్ట్ చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్. ఈ మూవీ గ్లింప్స్ కు మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. ఇక ఆ తర్వాతి మూవీ టైటిల్ అనౌన్స్ చేయబోతున్నాం అని ప్రకటించాడు విజయ్ దేవరకొండ.

రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేయబోతోన్న మూవీ టైటిల్ ను ప్రకటించబోతున్నాం అని చెప్పారు. నిజానికి రౌడీ జనార్థన్ కంటే ముందే ఈ మూవీ రావాల్సి ఉంది. బట్ ఈ సినిమా భారీ స్థాయిలో ఉండబోతోంది. అందుకే ముందుగా రౌడీ జనార్థన్ ను ప్రారంభించారు. ఇక రాహుల్ సాంకృత్యన్ మూవీ టైటిల్ ను 26.1.26న ప్రకటించబోతున్నారు. అంటే ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ అవుతుందన్నమాట. మైత్రీ మూవీస్ వాళ్లు నిర్మించబోతున్నారు ఈ చిత్రాన్ని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉండబోతోందట. మరి ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. బట్ ఈ నెల 26న మాత్రం టైటిల్ తో పాటు ఒక చిన్న వీడియో గ్లింప్స్ కూడా వస్తుందట. మరి ఈ టైటిల్ ను బట్టి కథ, కంటెంట్ ఏంటీ అనేది ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. 

 

Tags:    

Similar News