Vijay : విజయ్ తో విజయ్ సేతుపతి

Update: 2025-12-18 12:57 GMT

ఈ మధ్య కాలంలో స్పెషల్ క్యారెక్టర్స్ ను చేయను అని చెప్పాడు విజయ్ సేతుపతి. పైగా విలన్ కూడా నటించను అని కూడా చెప్పాడు. బట్ క్యారెక్టర్ నచ్చితేనే చూద్దాం అని కూడా చెప్పాడు. అలా అతను చూడాల్సిన సినిమా ఒకటి తెలుగు నుంచి వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించే రౌడీ జనార్థన్ మూవీనే అది. ఈ మూవీలో విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలో నటించాలనుందట. అలాంటి పాత్రలో అతను మాత్రమే చేయాలి అనే దర్శకుడి కోరిక కూడా చెబుతున్నారు.

దర్శకుడు రవి కిరణ్ కోలా కోరిక మేరకు విజయ్ సేతుపతిని అప్రోచ్ అయ్యారట. అతని పాత్ర బలమైన విలన్ గా కనిపిస్తుందని చెప్పాడు. అయితే ఈ కథ విజయ్ సేతుపతికి నచ్చిందట. నచ్చడంతో పాటు భారీగా రెమ్యూనరేషన్ కూడా కోరుకున్నాడట. ఈ మూవీ కోసం కేవలం 20రోజుల కాల్షీట్స్ కోసం 20 కోట్లు డిమాండ్ చేస్తాడట. దీంతో నిర్మాత దిల్ రాజు ఆలోచనలో పడిపోయాడట. అటు చూస్తే విజయ్ సేతుపతి.. ఇటు చూస్తే 20 కోట్లు అని ఆగిపోయాడట. మరా పాత్రలో మరో నటుడు సూటబుల్ అనిపిస్తే ఆ నటుడితోనే వెళతాడట లేక విజయ్ సేతుపతితోనే వెళతాడా అనేది చూడాలి. ఒవకవేళ విజయ్ సేతుపతి ఓకే అవుతాడైతే అవుతే.. విజయ్ దేవరకొండకు మరో తెలుగు, తమిళ్ బై లింగ్వుల్ మూవీగా అవుతోంది. అట్నుంచి కీర్తి సురేష్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ 22న టైటిల్ గ్లింప్స్ కూడా విడుదల చేయబోతున్నారు మేకర్స్.

Tags:    

Similar News