Cobra Movie : కోబ్రా ట్రైలర్ వచ్చేసింది.. ఐదు క్యారెక్టర్స్‌తో విక్రమ్ మ్యాజిక్

Cobra Movie : విక్రమ్ కోబ్రా మూవీ అనేక వాయిదాల తరువాత ఎట్టకేలకు ఆగస్టు 31వ తేదీన థియేటర్లో రిలీజ్ కానుంది

Update: 2022-08-25 14:15 GMT

Cobra Movie : విక్రమ్ కోబ్రా ట్రైలర్ వచ్చేసింది. అనేక వాయిదాల తరువాత ఎట్టకేలకు ఈ సినిమా ఆగస్టు 31వ తేదీన థియేటర్లో రిలీజ్ కానుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. అంచనాలకు తగ్గట్టుగా కోబ్రా ట్రైలర్ ఉంది. మొత్తం 5 భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. గణిత శాస్త్రవేత్తగా విక్రమ్ ఇందులో నటించాడు. ట్రైలర్ మొత్తం ఆసక్తిగా సాగింది. ఐదు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో విక్రమ్ మనకి ఈ ట్రైలర్‌లో కనిపిస్తాడు. పోలీసులు విక్రమ్‌ను అరెస్ట్ చేస్తారు. క్రికెటర్ ఇర్ఫాన్ పతాన్ ఇందులో కీలక పాత్ర పోషిండం మరో హైలైట్. ఏ.ఆర్ రెహ్మాన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్స్‌పెక్టేషన్స్‌ను కోబ్రా మూవీ రీచ్ అవుతుందని పలు రివ్యూలు చెబుతున్నాయి.

Full View

Tags:    

Similar News