Vikrant Rona OTT : విక్రాంత్ రోణ ఓటీటీ డేట్ వచ్చేసింది..
Vikrant Rona OTT : కిచ్చా సుదీప్ ప్యాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోణ ఓటీటీ డేట్స్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ వచ్చేసాయి;
Vikrant Rona OTT : కిచ్చా సుదీప్ ప్యాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోణ ఓటీటీ డేట్స్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ వచ్చేసాయి. గత నెల జులై 28న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ అయి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. రూ.100 కట్లతో నిర్మితమైన ఈ మూవీ సుమారు రూ.150 కోట్లు కలెక్ట్ చేసింది. విక్రాంత్ రోణ ఓటీటీ రైట్స్ జీ5 కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 2న జీ5లో స్ట్రీమ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇది కేవలం కన్నడ ల్యాంగ్వేజికి సంబంధించింది మాత్రమే. మిగతా భాషల్లో కూడా జీ5లోనే స్ట్రీమ్ అవుతుందో లేదో ఇంకా ప్రకటించలేదు. విక్రాంత్ రోణ పాత్రలో సుదీప్, ఐటమ్ గర్ల్‌గా జాక్విలిన్ ఫర్నాండెస్, హీరోయిన్‌గా నీతా అశోక్ నటించారు. అనూప్ బండారి దీనికి దర్శకత్వం వహించారు.