Vishwambhara : ఫైనల్ స్టెప్ వేస్తోన్న మెగాస్టార్

Update: 2025-07-25 10:30 GMT

మెగాస్టార్ అంటే అదీ. ఈ ఏజ్ లో కూడా ఏ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్స్ చేస్తూ దర్శక, నిర్మాతలకు గొప్పగా కోపరేట్ చేస్తున్నాడు. నిన్నటికి నిన్ననే అనిల్ రావిపూడి మూవీ మూడో షెడ్యూల్ ను ముగించుకుని కేరళ నుంచి వచ్చాడు. ఒకే ఒక్క రోజు గ్యాప్ తీసుకుని ఇప్పుడు విశ్వంభర సెట్ లో అడుగుపెట్టాడు. విశ్వంభర ఆలస్యం గురించి అందరికీ తెలుసు. అయినా ఈ మూవీ కోసం అతను టైమ్ ఇస్తూనే ఉన్నాడు. నిజానికి ఆయన స్థానంలో మరో హీరో ఉంటే నిర్మాతలను ముప్పు తిప్పలు పెట్టేవాడు. కానీ నిర్మాతల వాల్యూ తెలిసిన హీరో కాబట్టి చిరంజీవి అలా చేయడం లేదు. విశ్వంభర కు సంబంధించి ఓ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తారు అనే టాక్ కొన్ని రోజులుగా వస్తోంది కదా.. ఆ పాట కోసమే స్టెప్పులు వేయబోతున్నాడు మెగాస్టార్. బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ ఈ స్పెషల్ సాంగ్ లో నర్తించబోతోంది. తనకు ఇదే ఫస్ట్ తెలుగు సాంగ్ కావడం విశేషం. ఈ సాంగ్ కు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఈ పాటతో పాటు ఓ రెండు మూడు రోజుల ప్యాచ్ వర్క్ షూట్ చేస్తే విశ్వంభరకు చిరంజీవితో వర్క్ అయిపోతుంది.

ఇక 14లోకాలకు సంబంధించిన కథతో రూపొందిన సినిమా ఇదీ అని వశిష్ట ఇంటర్వ్యూస్ లో చెబుతూ వస్తున్నాడు. ఆ 14వ లోకంలో తను వెదికేది ఏదో ఉంటుందట. దాన్నే సత్యలోకం అంటారు. భూమి నుంచి హీరో ఆ సత్యలోకానికి వెళ్లే అవసరం ఏం వచ్చింది.. అక్కడికి చేరుకునే క్రమంలో ఎదురైన సంఘటనలేంటీ అనేది కథనంగా అనుకోవచ్చు. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. త్రిష హీరోయిన్. కునాల్ కపూర్, అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, రావు రమేష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మొత్తంగా మెగాస్టార్ స్పెషల్ సాంగ్ రెడీ అవుతోంది. 

Tags:    

Similar News