Viswak Sen CULT : మరోసారి మెగా ఫోన్ పట్టిన విశ్వక్ సేన్

Update: 2025-05-11 09:35 GMT

ఈ తరంలో బయటి నుంచి వచ్చిన హీరోలు తమను తాము నిలబెట్టుకోవడం కోసం తామే రంగంలోకి దిగుతున్నారు. వీరిలో నటన మాత్రమే కాక ఇతర టాలెంట్స్ కూడా చాలానే ఉన్నాయి. అలా ప్రూవ్ చేసుకునే హీరో అయ్యాడు విశ్వక్ సేన్. అతనికి సరైన విజయాలు లేని టైమ్ లో తనే స్వయంగా మెగా ఫోన్ పట్టుకుని ఫలక్ నుమాదాస్ అనే మూవీతో హిట్ కొట్టాడు. ఆ హిట్ తో ఇన్నేళ్లుగా సర్వైవ్ అవుతున్నాడు. బట్ కొన్నాళ్లుగా మళ్లీ పరాజయాలే పలకరిస్తున్నాయి. దీంతో మరోసారి తను మెగా ఫోన్ పట్టుకున్నాడు. అతని దర్శకత్వంలో రెండో సినిమా ప్రారంభంమైంది.

విశ్వక్ సేన్ సెకండ్ మూవీకి ‘కల్ట్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇవాళ సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ తో మూవీ ప్రారంభం అయింది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన గాయత్రి భరద్వాజ్, యజ్ఞ తుర్లపాటి హీరోయిన్లుగా నటిసతున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించబోతున్నాడు. తారక్ సినిమాస్, వాజ్మయీ క్రియేషన్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదల చేస్తారట. ఈ మేరకు పోస్టర్స్ లో ఆ లాంగ్వేజెస్ పేర్లు కూడా వేశారు. మొత్తంగా విశ్వక్ సేన్ ఫలక్ నుమాదాస్ తో తెలుగులో పాగా వేశాడు. ఈ మూవీతో ఏకంగా ప్యాన్ వరల్డ్ అనేట్టున్నాడు. మరి దర్శకుడుగా అతని రెండో సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News