వార్ 2.. మోస్ట్ ప్రిస్టీజియస్ మూవీ అనుకున్నారు. కానీ ప్రమోషన్స్ లేకపోవడంతో పాటు హృతిక్ రోషన్ ఫ్లాపుల్లో ఉండటం.. ఇటు సేమ్ డే రేసులో ఉన్న కూలీ అన్ని రకాలుగా అప్పర్ హ్యాండ్ సాధించడంతో వెనకబడిపోయింది. అడ్వాన్స్ సేల్స్ నుంచే కూలీ ఇప్పటికే 90 కోట్లు కొల్లగొట్టింది. ఇటు వార్2 అందులో సగం కూడా సాధించలేదు. ఇక ఈ మూవీ ఓపెనింగ్స్ భారం అంతా ఇప్పుడు ఎన్టీఆర్ మీదే ఉంది. అతని ఛరిష్మానే ఈ మూవీకి భారీ ఓపెనిగ్స్ తేవాల్సిన పరిస్థితి ఉంది. అఫ్ కోర్స్ ఎలా చూసినా 150 కోట్ల వరకూ రావడం ఖాయం. ఆల్రెడీ ఎన్టీఆర్ దేవర 140 కోట్లతో ఫస్ట్ డే ఓపెనింగ్ సాధించిన రికార్డ్ ఉంది అతనికి. ఇప్పుడు బాలీవుడ్ కూడా స్ట్రాంగ్ గా యాడ్ అవుతుంది కాబట్టి ఈ ఫిగర్స్ ఇంకా పెరగొచ్చు. బట్ ప్రస్తుతం ఈ మూవీ రేంజ్ అంతా ఎన్టీఆర్ పైనే డిపెండ్ అయిందనేది నిజం.
యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై వర్స్ లో భాగంగా రూపొందిన వార్ 2 ట్రైలర్ తర్వాత ఇంకే రకంగానూ ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఎన్టీఆర్ కోసం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అది కూడా సితార నాగవంశీ వల్లే సాధ్యం అయింది. ఈ ఒక్కటీ తెలుగు స్టేట్స్ లో క్రేజ్ తెచ్చింది. అటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మినిమం ప్రమోషన్ కూడా లేకుండా ప్యాన్ ఇండియా సినిమా అనే ట్యాగ్ తో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వస్తోంది. అయినా సౌత్ లో ఎన్టీఆర్ కు క్రేజ్ ఉంది. ఆ క్రేజే ఈ సినిమాను కాపాడాల్సి ఉంటుంది. మరి కాపాడుతుందా లేదా అనేది ఫస్ట్ డే కలెక్షన్స్ తోనే తెలిసిపోతుంది.