War 2 : ఆర్.ఆర్.ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) తన క్రేజ్ ని మరింత పెంచుకోవడానికి రెడీ అవుతున్నాడు. అందులో భాగంగా ఆయన పాన్ ఇండియా సినిమాలతో పాటు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం.. ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ (Koratala Shiva) డైరెక్షన్ లో "దేవర" (Devara) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి భాగం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.
‘దేవర’ పార్ట్ 1 తర్వాత ఎన్టీఆర్.. హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో కలిసి "వార్ 2" (War 2) అనే బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే . యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎన్టీఆర్ ఇప్పటికే కొన్ని యాక్షన్ సన్నివేశాలలో పాల్గొన్నాడు. ఆగస్టు 18 నుంచి ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడని సమాచారం. ఈ లాంగ్ షెడ్యూల్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పై ఓ బిగ్ ఫైట్ సీన్ షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
"వార్ 2" లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ లో భీమ్ పాత్రతో నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో మరింత పాపులర్ అవ్వడం ఖాయం. "వార్ 2" తర్వాత, ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి "NTR31" అనే పాన్ ఇండియా యాక్షన్ డ్రామాలో నటించబోతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది. మొత్తం మీద, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ లోనే బిజీ షెడ్యూల్ తో దూసుకువెళ్తున్నాడు.