NTR : ఎన్టీఆర్.. ఎందుకిలా చేస్తున్నాడు

Update: 2026-03-07 10:54 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ గా ఫ్యాన్స్ పిలుచుకుంటున్నాడు ఎన్టీఆర్ ని. అఫ్ కోర్స్ మాస్ లో తిరుగులేని మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ అతను. అయితే ఇతను కొన్నాళ్లుగా తనలో తనే ఉండిపోతున్నాడు. జనాల్లోకి వెళ్లడమే మానేశాడు. జనం గురించి పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా దేవర తర్వాత అతను ఫ్యాన్స్ తో మినిమం కూడా మీట్ కాలేకపోతున్నాడు. వార్ టైమ్ లో అతని కోసం అభిమానులు తెగ మాట్లాడారు. కనీసం ఒక్కసారైనా మమ్మల్ని పట్టించుకోండి అని అభిమానులు అదే పనిగా కోరారు. ఇదుగో వస్తా .. అదుగో వస్తా అంటూనే ఉన్నాడు తప్ప వారిని కలవడం మాత్రం చేయడం లేదు. దీంతో అసలు ఎన్టీఆర్ కు ఏమైంది. ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ అంతా తెగ వర్రీ అవుతున్నారు. అభిమానుల్ని కలవడంలోనే కాదు.. తన నట కులానికి చెందిన వారితో అయినా అతను లైట్ తీసుకుంటున్నాడా అన్నట్టుగా కనిపిస్తోంది.

ఈ మధ్య అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ కు అటెండ్ కాలేదు ఎన్టీఆర్. ఆ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా రిసెప్షన్ కు కూడా రాలేదు. కనీసం తన కుటుంబంలో ఎవరైనా ఒకరైనా వస్తే బావుంటుంది కదా. అది కూడా లేదు. పోనీ సినిమాలతో బిజీగా ఉన్నాడా.. అదే పనిలో విదేశాల్లో ఉండిపోయా అంటే.. అదీ లేదు. హైదరాబాద్ లోనే ఉన్నాడు. మహా అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తున్నాడు. బట్ ఇంత పెద్ద వాళ్ల పెళ్లిళ్లకో లేక రిసెప్షన్ కో అయినా అటెండ్ కాలేకపోయేంత బిజీగా ఉన్నాడేంటో ఈయన అంటున్నారు చాలామంది. అల్లు శిరీష్ అన్న అయిన అల్లు అర్జున్ తో ఎన్టీఆర్ కు మంచి బాండింగ్ ఉంది కదా. బావా.. బావా అని పిలుస్తాడు కదా. కనీసం అల్లు అర్జున్ వారి ఇంట్లో జరిగే పెళ్లికి కూడా రాలేకపోవడం ఏంటీ అనేది మాత్రం అంతుబట్టని విషయంగా కనిపిస్తోంది. ఏదేమైనా ఈ మధ్య ఎన్టీఆర్ జనాల్లోకి రాలేకపోతున్నాడు.. జనాల్లో కలవడానికి ఇష్టపడటం లేదు.. అనేది మాత్రం చాలా క్లియర్ గా తెలుస్తోంది. మరి అతను ఎందుకు ఇలా చేస్తున్నాడో అనేది మాత్రం తెలియకుండా ఉంది. 

Tags:    

Similar News